సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అట

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నాడట..అవును మీరు నమ్మినా నమ్మక పోయినా..ఇది నిజం.ట్విట్టర్ లో స్పందించడం..6 నెలలకో ప్రెస్ మీట్ పెట్టి కామెడీ చేయడం అలవాటుగా చేసుకున్న పవర్ స్టార్ రూట్ మార్చబోతున్నారట..నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనదయిన ముద్ర వేసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టేస్తారేమో చూడాల్సిందే.

మొన్న తిరుపతి సభ చూసారు కదా.పవన్ మాటల ధాటి..ఎవరి పైన అని మాత్రం అడక్కండి..అది ఆయనకే క్లారిటీ లేదు..ఎప్పటిలాగే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ని ఆ పార్టీ కురువృద్ధుల్ని వరుసపెట్టి ఆడేసుకున్న పవన్ ఆటలో అసలు ప్రత్యర్థుల్ని మాత్రం అతి సున్నితంగా సుతారంగా స్పృశించారంతే.

ఇక తాజాగా జనసేన పార్టీ ఈ నెల 9న కాకినాడలో తలపెట్టిన బహిరంగ సభకు పేరు ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నిర్వహించనున్న ఈ సభకు ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’గా పేరు పెట్టారు.అంతా బానే వుంది ఈసారి పవన్ ఎవరిపై అస్త్రాలు సాధిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మన ఎంపీ లు కేంద్రం లో సర్ సర్ అంటూ దీనంగా వేడుకుంటున్నారని విమర్శించన పవన్ మాత్రం మోడీ గారూ,వెంకయ్య గారూ,నన్ను క్షమించండి..అంటూ ఈయన చేసిన యాచనమేంటో మరి ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇక ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ అంటూ పవన్ ఏ స్క్రిప్ట్ తో రెడీ అయ్యాడో తెలీదు కానీ తిరుపతి సభలో మాదిరిగా ఓ దశా దిశా లేకుండా ప్రసంగిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ మనుగడే ప్రస్నార్ధకం అవుతుంది.ప్రత్యేకహోదా ఇవ్వకుండా వంచిస్తోందెవరు..ఇవ్వకపోయినా దేహి అంటూ పోరాడకుండా యాచిస్తోందెవరు..సూటిగా ప్రశ్నించు..అప్పుడే ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ అన్న పేరుకైనా సార్థకత ఉంటుంది..లేకపోతే ఇది కూడా తిరుపతి లో లాగా సామాన్య రాజకీయ నాయకుడిలా..ఆచి తూచి..అస్థవ్యస్థనంగా మాట్లాడితే మాత్రం రాజకీయ నాయకుడిలా ఇంకోమెట్టుక్కువుతావేమో కానీ..ప్రశ్నించే నాయకుడు పవన్ కళ్యాణ్ గా మాత్రం పాతాళానికి పడిపోతాడు.