హైపర్ TJ రివ్యూ

సినిమా : హైపర్
రేటింగ్:3.25/5
టాగ్ లైన్:ఎనర్జీ+ఎమోషన్=హైపర్

నటీనటులు : ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ
సినిమాటోగ్రఫీ : సమీర్రెడ్డి.
మాటలు:అబ్బూరి రవి
ఎడిటింగ్: గౌతంరాజు.
నిర్మాత : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర.
బ్యానర్ ; 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్.
లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా.
సంగీతం : జిబ్రాన్.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:సంతోష్ శ్రీనివాస్

సగటు సినీ ప్రేక్షకుడికి లాజిక్ తో సంబంధం ఉండదు,కొంచెం వినోదం, ఇంకొంచెం ఎనర్జీ ని కలగలిపి కాస్త ఎమోషన్ ని జోడించి పక్కా స్క్రిప్ట్ తో సినిమా తీస్తే సక్సెస్ అవుతుందని నమ్మి తీసిన సినిమాయే ఈ హైపర్.రామ్ అంటే మనకు ఇది వరకు ఎంత ఎనర్జీటిక్ గా తెలుసో దానికి ఇంకో మోతాదు హైపర్ ని జోడించి తీసాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాని.కందిరీగతో రామ్ లోని ఎనర్జీ ని మాత్రమే వాడిన సంతోష్ ఈ సినిమాలో రామ్ లోని ఎనర్జీ తో పాటు ఎమోషన్ ని కూడా బాగానే వాడేసాడు. కొత్తదనం లేకపోయినా సినిమా ఎక్కడా డీవియేట్ అవ్వకుండా అనుకున్నది అనుకున్నట్టు సంతోష్ తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించాడు.

ఓ ప్రభుత్వోద్యాగి నిజాయితీకి,ఇంకో రాజకీయనాయకుడు ఇగో కి మధ్య జరిగే కథే ఈ హైపర్.సింపుల్ గా చెప్పాలంటే ఈ మధ్య వచ్చిన జనతా గారేజ్ సినిమాలో రాజీవ్ కనకాల గవెర్నమెంట్ ఆఫీస్ ఎపిసోడ్ ని స్క్రిప్ట్ గా రాసుకుని దాని చుట్టూ కథను అల్లిందే ఈ హైపర్.ఈ నిజాయితీ,ఈగో ల మధ్య తండ్రి కొడుకుల అనుబంధాన్ని జొప్పించి కథను దర్శకుడు నడిపిన తీరు మెచ్చుకోవాల్సిందే.

తండ్రంటే కొందరికి ఇష్టం ఉండొచ్చు,ఇంకొందరికి ప్రేమ ఉండొచ్చు కానీ నాకు మాత్రం పిచ్చి అనే క్యారెక్టర్ లో రామ్ చింపేసాడు.రామ్ ఎనర్జీ గురించి కొత్తగా చెప్పేదేం లేదు కానీ ఇక్కడో విషయం చెప్పాలి..ఎప్పటికప్పుడు సినిమా హీరోలకి కటౌట్ తో పనిలేదు కాంఫిడెన్స్ ఉంటే చాలు అని రామ్ ప్రూవ్ చేస్తూనే వున్నాడు.ఓ 20-30 మంది రౌడీలని రామ్ లాంటి కటౌట్ ఉన్న హీరో పిచ్చి పిచ్చిగా కొట్టేస్తాడంటే వినడానికి ,చూడ్డానికే ఎబ్బెట్టు గా ఉంటుంది.. అదే రామ్ కొడుతుంటే మాత్రం ఆ కాంఫిడెన్స్ కి ఎక్కడా కటౌట్ అన్న క్వశ్చన్ ఏ రాదు.రామ్ లోని ఆ కాంఫిడెన్స్ కి,దాన్ని సంతోష్ వాడిన విధానానికి సినిమా ఆద్యంతం ఆసక్తిగా నడిచిపోతుంది.

సత్యరాజ్ ని పదే పదే ఎందుకు తెలుగు సినిమాల్లో పిలిచి మరీ పాత్రలిస్తున్నారో మరో సారి చూపించాడు ఈ సినిమాలో.రాశిఖన్నా ముద్దుగా బొద్దుగా అలరించినా పాపం పాటల్లో తప్ప కథలో పాపకి పెద్దగా పనిలేకపోయింది..మురళి శర్మ ఓ డిఫరెంట్ పాత్రలో అలరించాడు.పోసాని,ప్రభాస్ శ్రీను,తులసి,హేమ తదితరులందరు పరిధిమేరకి అలరించారు.ఇక ముక్యంగా మాట్లాడుకోవాల్సింది రావు రమేష్ గురించి.ఎన్ని వేరియేషన్స్..ఎన్ని షేడ్స్..రావు రమేష్ సినిమాని ఎక్కడికో తీస్కెళ్లిపోయాడు తన క్యారెక్టర్ తో.మాములుగా అయితే అది హీరో తో పోటీ పడే విల్లన్ పాత్ర..దాన్ని రావు రమేష్ చేయడం తో వచ్చిన ఇంపాక్ట్ వేరెవరు చేసినా రాదు.

సంతోష్ శ్రీనివాస్ కొత్తదనం అనే కలరింగ్ ఇచ్చేప్రత్నం చేయలేదు.తాను ఏమనుకున్నాడో ఎవర్ని టార్గెట్ చేసి సినిమా తీస్తున్నాడో చాలా క్లారిటీ గా క్లియర్ గా సినిమాని తీసాడు. నిజాయితీ,ఇగో,ప్రేమ,పిచ్చి అనే ఈ నాలుగు అంశాలని సంతోష్ డీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఎక్కడా ఒక దాన్ని ఒకటి డామినేట్ చేయకుండా నాలుగింటిని నాలుగు పిల్లర్స్ గా చేసుకుని సినిమాని నడిపించాడు.స్క్రీన్ ప్లే ఇంటరెస్టింగ్ గానే వుంది.కాకపోతే క్లైమాక్స్ కొంచెం లాగినట్టనిపిస్తుంది.ఒకానొక దాసలో సినిమా అయిపోయిందనిపిస్తుంది..ఆ వెంటనే పాట, దానితరువాత మళ్ళీ సినిమా..ఇలా కొంచెం సాగదీయడం మినహా సినిమాని బాగా డీల్ చేసాడు సంతోష్.సుమన్ ఎపిసోడ్ కి సరైన ముగింపు ఇచ్చి ఉంటే బాగుండేది.

పాటలు ఊకదంపుడే..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంటే కథకి ఇంకా హెల్ప్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండుండాల్సింది.ఈ సినిమాకి ఇంకో హీరో మాత్రం మాటలు రాసిన అబ్బూరి రవి.చాలా కాలం తరువాత గుర్తుపెట్టుకోలేనన్ని అద్భుతమైన డైలోగ్స్ ఈ హైపర్ సినిమాలో వున్నాయి.అందుకే అబ్బూరి రవి కి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.అక్కడక్కడా గుర్తున్న కొన్ని డైలాగ్స్ మీకోసం.

1)తెలుగక్షరాల్లో ళ , ఱ(బండి ర ) ఎవరికీ తెలీనట్టు వీడేంట్రా ఇప్పుడొచ్చి నిజాయితీ అంటాడు.

2)నీ బలగమంతా నువ్వు కొంటె వచ్చింది..అదే మా నాన్న బలం నన్ను కంటే వచ్చింది.

3 )పిల్లలతో పెద్ద వాళ్ళు మాట్లాడాలంటే మాటలు వెతుక్కోవాల్సి వస్తోంది.(ఈ తరం పిల్లల వాదన తో పెద్దలు పడే పాటల గురించి)

4)అతను దూరంగా ఉంటే అతనిలా వుండాలనిపిస్తుంది అదే అతను దగ్గరగా ఉంటే అతనితో బ్రతకాలనిపిస్తుంది.

5)కలుపునే బంధం కదా ఆయన తెంచుకెళ్లిపోయారు,కన్న బంధం కదా వాడ్ని వెళ్ళమనలేను..ఈ అవమానాన్ని ఇంట్లో వుంచుకోనూ లేను.

6)పేడ పిసికింది నేనే కానీ పిడక కొట్టింది నేనుకాదు అన్నాడంట నీలాంటి వాడు.(ఈ డైలాగ్ ఒక్కటి చాలు క్లైమాక్స్ లో బయటికొచ్చే ప్రేక్షకుడి పెదాలపై నవ్వు నిలపడానికి)

ఓవర్ అల్ గా సినిమా ఎవ్వర్నీ ఎక్కడా డిసప్పోయింట్ చెయ్యదు.అలాగని ఇదేదో ఫార్ములాకి ఎదురొడ్డి వచ్చిన సినిమా కూడా కాదు.పక్క స్క్రిప్టెడ్ అండ్ ప్లాన్డ్ సినిమా.