100 Days Of లవ్ TJ రివ్యూ

సినిమా: 100 Days Of లవ్
TJ రేటింగ్: 2/5
టాగ్ లైన్: లవ్ ఫెయిల్యూర్
నటీనటులు: దుల్కర్ సల్మాన్,నిత్య మీనన్,అజు వరగేసే,ప్రవీణ ప్రమోధ్,రాహుల్ మాధవ్ …
నిర్మాత: KV విజయకుమార్ పాలకున్ను
సంగీతం: గోవింద్ మీనన్
లిరిక్స్: కృష్ణ చైతన్య
ఎడిటింగ్: సందీప్ కుమార్
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:జెన్యూస్ మొహమ్మద్

ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి మళ్ళీ ఇంకొకరి ప్రేమలో పడి ఆ ప్రేమనైనా పొందడా లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయ్యాడా అనే కథతో సినిమా తీసాడు డైరెక్టర్ జెనుసే మొహమ్మద్. అయితే లవ్ ఫెయిల్ అయిన వ్యక్తి గా హీరో దుల్కర్ సల్మాన్ నటించాడు.

సినిమా హీరోక్యారక్టరైజేషన్ మీదే ఆధారపడి మొత్తం నడుస్తుంది. ఏదయినా తనకు ప్యాషన్ వున్న పనే చేస్తాడు హీరో. దానికోసం తలితండ్రులను కూడా వదిలేసి తన క్లోజ్ ఫ్రెండ్ తోనే నివసిస్తాడు. అలా జీవించే హీరో, చాల సెక్యూర్డ్ గా ఈ జనరేషన్ లోని లవ్ అంటే నమ్మకం లేని హీరోయిన్ ని ప్రేమిస్తాడు. ప్రేమించి ఆ హీరోయిన్ ని ఎలా తనను ప్రేమిచేలా చేసుకున్నాడనే దాని పైనే సినిమా సాగుతుంది.

సినిమా స్టార్టింగ్ లో హీరో లవ్ ఫెయిల్ అయిన వ్యక్తిగా తనని తాను పరిచయం చేసుకుంటాడు. పరిచయం అయిన వెంటనే అసలు హీరోయిన్ ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆ తరువాత అంతా పాత చింతకాయ పచ్చడి లాగానే హీరోయిన్ ని వెతకటానికి హీరో, అతని ఫ్రెండ్ తిరుగుతూ వుంటారు ఆ సన్నివేశాలన్నీ చాలా బోరింగ్ గానే ఉంటాయి.

చివరికి ఇంటర్వెల్ ముందు అనుకోకుండా హీరోయిన్ హీరోని కలుస్తుంది అప్పటివరకు సినిమా మొత్తం హీరో, హీరో ఫ్రెండ్ తోనే సాగుతుంది. హీరోయిన్ హీరోని కలిసిన తరువాత సినిమా మెయిన్ ట్రాక్ లోకి వస్తుంది. అప్పటిదాకా విసిగిపోయిన ప్రేక్షకులకి నిత్యామీనన్ ఎంట్రీ తో కొంచెం ఉత్సాహం వస్తుంది.

అయితే నరేషన్ చాలా స్లోగా ఉండటం తో సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని కొన్ని సీన్స్ బోరుకొట్టించాయి.డైరెక్టర్ ఏమిచెప్పాలనుకున్నాడనే దాని పైన క్లారిటీ మిస్సయ్యింది. సినిమా మొత్తం ఏదో అలా సాగిపోతూ ఉంటుందే తప్ప ఎక్సయిట్ మెంట్ ఏమి ఉండదు, అద్భుతమయిన లవ్ సీన్స్ కూడా ఏమి లేవు. సినిమా మొత్తం లో ఒక్క నిత్యామీనన్ స్క్రీన్ ప్రెజన్స్ తప్ప ఇంక ఏమి అంత గొప్పగా లేవు.