2019 ఎన్నికల్లో జనసేనకు ఎవరి సలహాలో తెలుసా..!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. 2019 ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నాడా? ఈ క్ర‌మంలో ఆయ‌న పొలిటిక‌ల్‌గా మేధావులైన ఫారిన్ ప్రొఫెస‌ర్ల‌ను క‌లుస్తున్నారా? ఎట్టి ప‌రిస్తితిలోనూ ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడా? అంటే ఔన‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. దీనికి ఈ చిత్ర‌మే సాక్ష్యం. ఫొటోలో ప‌వ‌న్‌తో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఆయ‌న.. అమెరికాలోని ప్ర‌ఖ్యాత విశ్వ‌విద్యాల‌యం హార్వ‌ర్ఢ్ ప్రొఫెస‌ర్‌. ఈయ‌న పేరు స్టీవెన్ జార్డింగ్‌.

ఈయ‌నకి ఇండియ‌న్ పాలిటిక్స్‌పై అపార‌మైన అనుభ‌వం ఉంది. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తే… ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌చ్చో.. ఈయ‌న‌కు బాగా తెలుసు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో  స్టీవెన్‌ జార్డింగ్ స‌ల‌హాల‌ను ఎస్పీ సార‌ధి అఖిలేష్ ఆచ‌రిస్తున్నార‌ట‌. దీంతో ఇప్పుడు స్టీవెన్ పొలిటిక‌ల్ నేత‌ల దృష్టిని ఆక‌ర్షించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో స‌హా అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జ‌న‌సేనాని  స్టీవెన్‌ జార్డింగ్‌తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోష‌ల్ మాధ్య‌మాల్లో హ‌ల్ చేస్తోంది. నిజానికి 2014లోనే ప‌వ‌న్ పార్టీ పెట్టినా.. పోటీకి దూరంగా ఉండిపోయాడు. అంతేకాదు, ప్ర‌ధాన ప‌క్షాలైన టీడీపీ, బీజేపీల‌కు మ‌ద్ద‌తిచ్చారు.

అయితే, ఇటీవ‌ల కాలంలో ఆయా పార్టీల ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ నేరుగా 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని డిసైడ్ అయ్యారు. ఇదే విష‌యాన్ని అనంత స‌భ‌లో ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో.. విజ‌య సాధ‌న‌కు ఎలాంటి వ్యూహం అనుస‌రించాలో  స్టీవెన్‌ జార్డింగ్ వ‌ద్ద స‌ల‌హాలు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ప‌వ‌న్ ఏ విధంగా దూసుకుపోతాడో చూడాలంటే రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే.