2019 కోసం పవన్ కొత్త ప్లాన్..! చూస్తే షాకవ్వాల్సిందే..!

February 11, 2017 at 5:30 am
add_text

పాలిటిక్స్ అన్నాక అన్ని వ‌ర్గాల స‌హ‌కారం, మ‌ద్ద‌తు లేక‌పోతే రాణించ‌డం విజ‌యం సాధించ‌డం అనేవి క‌ష్ట‌మే! అది ఎన్‌టీఆర్ అయినా.. చంద్ర‌బాబు అయినా.. ఇప్పుడు ప‌వ‌న్ అయినా స‌రే! పాలిటిక్స్‌లో ఎంద‌రి అభిమానం, మ‌ద్ద‌తు ల‌భించింద‌నేదే కీల‌కం. ఇప్పుడు ప‌వ‌న్ అదే దిశ‌గా అంద‌రినీ ఆక‌ర్షిస్తూ.. ముందుకు సాగుతున్నాడ‌ట‌. నిన్న మొన్న‌టి వ‌రకుత‌న అన్న సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా ఎదిగిన చిరంజీవితో ప‌వ‌న్ విభేధిస్తున్నాడ‌నే టాక్ ఉంది. చిరును లెక్క చేయ‌డ‌ని, ప‌వ‌న్ త‌న పంతాన్నే నెగ్గించుకునే స్వ‌భావం క‌ల‌వాడ‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే, ఈ ప‌రిణామంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాతావ‌ర‌ణం ఎలా ఉన్నా 2019 నాటికి మాత్రం తాను అంద‌రివాడు అని అనిపించుకోవాల్సిన అవస‌రాన్ని ప‌వ‌న్ గుర్తించాడ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు అన్న‌య్య అభిమానుల‌ను ఒకింత దూరం పెట్టాడు. అయితే, ఈ ప‌రిస్థితి 2019 నాటికి ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని గ్ర‌హించిన ప‌వ‌న్‌.. ఇప్ప‌టి నుంచే అన్న‌య్య వ‌ర్గంగా భావిస్తున్న‌వారిని ద‌గ్గ‌ర‌కు చేర్చుకునే ప‌నిలో ప‌డ్డాడ‌ట ప‌వ‌న్‌. ఈ క్ర‌మంలోనే ఓ ప్ర‌ముఖుడు ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చార‌ట‌. తాను ప‌వ‌న్ అభిమాన‌ని కాన‌నీ.. మొద‌ట్నుంచీ చిరంజీవిని అభిమానిస్తున్నాన‌ని నేరుగా ప‌వ‌న్‌తోనే చెప్పాడ‌ట‌.

కానీ, జ‌న‌సేన పెట్టిన త‌రువాత ప‌వ‌న్‌ ఐడియాలజీ న‌చ్చ‌డంతోనే క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మై వ‌చ్చాన‌ని ఆ వ్య‌క్తి అన్నాడ‌ట‌. దీంతో ఆయ‌న కామెంట్ల‌ను మెచ్చుకున్న ప‌వ‌న్‌.. వెంట‌నే అత‌డిని జ‌న‌సేన టీమ్‌లో జాయిన్ చేసుకున్నాడ‌ట‌! సో.. దీని ద్వారా ప‌వ‌న్ ఇస్తున్న సంకేతం ఏంటంటే.. చిరంజీవి అభిమానుల‌ను తాను వేరే దృష్టితో చూడటం లేద‌నీ, అన్న‌య్యను అభిమానించేవారు త‌న‌కీ అభిమానులే అని! అన్న‌య్య‌నూ త‌న‌నూ రాజ‌కీయంగా కూడా వేర్వేరుగా చూడొద్ద‌నే సంకేతం ఈ ఘ‌ట‌న ద్వారా ఇచ్చిన‌ట్టు అర్థం చేసుకోవ‌చ్చు.

2019 కోసం పవన్ కొత్త ప్లాన్..! చూస్తే షాకవ్వాల్సిందే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share