అక్కినేని డబుల్ ధమాకా-ఒక వేదిక రెండు పెళ్లిళ్లు

అక్కినేని నాగ చైతన్య ,సమంతల ప్రేమ వ్యవహారం ఈ మధ్య బాగా చర్చినీయాంశం అయింది.సోషల్ మీడియా లో అయితే ప్రతిరోజు వీరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా చైతు,సమంతల పెళ్లికి నాగార్జున పచ్చ జెండా ఊపాడని తెలుస్తోంది.ఓ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ నాగార్జునే స్వయంగా నేను అమల చైతన్య విషయంలో చాలా సంతోషంగా వున్నాం.చైతు జీవితభాగస్వామిని,ఎవరితో అయితే తాను హ్యాపీ గా ఉంటాడో వారినే ఎంచుకోవడం మాకు చాలా అందంగావుంది అని దీనిపై త్వరలోనే అందరికి అనౌన్స్ చేస్తామని తెలియజేశాడు.ఇంకేముంది చైతు సమంతల పెళ్లి గంట మోగబోతోందన్నమాట.

ఇదిలా ఉండగా నాగార్జున మరో వారసుడు,అఖిల్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అక్కినేని అఖిల్,ఫ్యాషన్ డిజైనర్ శ్రీయ భూపాల్ ప్రేమ వ్యవహారం బయటికి పొక్కింది.దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇంకోవైపు నాగార్జున అఖిల్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని,రెండుపెళ్ళిళ్ళు ఒకే సారి ఒకే వేదికపై కనులపండుగగా జరగబోతున్నాయని ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ టాక్. ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకి పెద్ద పండుగే.