మంత్రి ఆదికి ఆప‌రేష‌న్ త‌ప్ప‌దేమో..?

September 11, 2018 at 1:10 pm

ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డికి ఎక‌సెక్కాలు ఎక్కువ‌య్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఓ పార్టీ జెండాపై గెలిచి.. మరో పార్టీలోకి దూరి మంత్రి ప‌ద‌వి కొట్టేసిన ఆయ‌న ఇప్పుడు టికెట్ భిక్ష పెట్టిన పార్టీనే తూలనాడుతున్నాడు. టికెట్ ఇ చ్చి స‌గ‌ర్వంగా గెలిచేలా చేసిన వైసీపీ అధినేత ప‌ట్ల క‌నీసం విశ్వాసం కూడా లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సొంత అను చరులే వాపోతున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌క‌పోయి ఉంటే ప‌రిస్థితి ఏంటో తెలిసేద‌ని విమ‌ర్శ లు గుప్పిస్తున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు చెంత‌కు చేరి ఆయ‌నకు భ‌ట్రాజులాగా మారాడ‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే… వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ద్రుఢ సంక‌ల్పంతో ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రాజ‌న్న రాజ్యం స్థాపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.Adinarayana-Reddy(2)

ఈ క్ర‌మంలోనే ఆయ‌న గ‌త ఏడాది నవంబ‌రు 6న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఈ యాత్ర‌కు ప్ర‌జ‌లు ఎక్కడిక‌క్క‌డ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. త‌మ స‌మ‌స్య‌లు జ‌న‌నేత‌తో చెప్పుకొంటున్నా రు. ప్ర‌స్తుత అవినీతి ప్ర‌భుత్వంతో వేగ‌లేక‌పోతున్నామంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌నేత‌కు పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ వేలాదిగా త‌ర‌లివ‌స్తున్న ప్ర‌జ‌లు జ‌గ‌న్ స‌భ‌ల‌ను దిగ్విజ‌యం చేస్తున్నారు. అ యితే, ఇవేవీ ప‌ట్ట‌న‌ట్టు.. ఇవేవీ త‌న‌కు క‌నిపించ‌న‌ట్టు కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి. జ‌గ‌న్ స భ‌ల‌కు జ‌నం లేర‌ని ఆయ‌న తాజాగా అసెంబ్లీ ప‌రిస‌రాల్లోనే మీడియాతో మాట్లాడారు. 1456247009-136

వాస్త‌వానికి తాజాగా జ‌గ‌న్ నిర్వ‌హించిన విశాఖ కంచ‌ర‌పాలెం స‌భ‌కు జ‌నం వ‌చ్చిన తీరు న‌భూతో అన్న విధంగా ఉంద‌ని ప్ర‌భుత్వ అనుకూల మీడియాలే చాటించాయి. అంతేకాకుండా.. అసలు అంత‌మంది వ‌స్తార‌ని కూడా ఎవ‌రూ ఊహించ లే దు. ఇదే విష‌యాన్ని అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున చ‌ర్చించుకోవ‌డం కూడా క‌నిపించింది. మ‌రి జ‌గ‌న్ స‌భ‌లు ఇలా హిట్ట‌వుతుంటే.. మంత్రి ఆదికి క‌నిపించ‌డం లేదా? అని అంటున్నారు విశ్లేష‌కులు. ఆయ‌న కేమైనా కంటి చూపు మంద‌గించిందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆదికి కంటి ఆప‌రేష‌న్ చేయించ‌డం ఉత్త‌మ‌మేమో! అంటున్నారు. మొత్తానికి ఈప‌రిణామం.. చంద్ర‌బాబును బుట్ట‌లో వేసుకునేందుకు ఆది ఆడుతున్న అప‌ర‌నాట‌కంగా చెబుతున్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగులో గ్రూపు త‌గాదాల‌ను ప్రోత్స‌హిస్తూ… టీడీపీలో చిచ్చు పెడుతున్న ఆదికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌రాద‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆదిలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని టీడీపీ నాయ‌కులే అంటున్నారు. 41144529_1950530104967447_7087913236426653696_n

మంత్రి ఆదికి ఆప‌రేష‌న్ త‌ప్ప‌దేమో..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share