కౌంట‌ర్ల వ‌ర్మ‌కే అకున్ అదిరిపోయే కౌంట‌ర్‌

July 24, 2017 at 12:47 pm
ramgopal

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏ విష‌యంలో అయినా, ఎవ్వ‌రిని వ‌ద‌లకుండా కౌంట‌ర్లు ఇవ్వ‌డంలో దిట్ట‌. నాగ‌బాబు, స‌న్నీలియోన్‌, ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే వ‌ర్మ ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డు. తాజాగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్ర‌గ్స్ ఇష్యూలో సిట్ అధికారులు ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక వ‌ర్మ శిష్యుడు అయిన పూరీ జ‌గ‌న్నాథ్ గ్యాంగ్‌ను సిట్ అధికారులు ప్ర‌ధానంగా టార్గెట్ చేయ‌డంతో వ‌ర్మ కాస్త నొచ్చుకుని ఉన్న‌ట్లున్నాడు. పూరీ, సుబ్బ‌రాజును విచారించిన‌ట్టుగా 12 గంట‌ల సేపు స్కూల్ పిల్ల‌ల‌ను కూడా విచారిస్తారా ? అని వ‌ర్మ సోష‌ల్ మీడియాలో సిట్ అధికారుల‌ను ఇన్ డైరెక్టుగా ఎటాక్ చేశాడు.

ఇక ఎక్సైజ్ శాఖ హైలెట్ అయ్యేందుకు సినిమా వాళ్లను ట్రైలర్లు, టీజర్లుగా వాడుకుంటున్నారని కూడా వ‌ర్మ ఆరోపించాడు. ఇక తాజాగా వ‌ర్మ కౌంట‌ర్ల‌కు రీ కౌంట‌ర్లు అన్న‌ట్టుగా అకున్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము విచార‌ణ‌లో స్కూల్ పిల్ల‌ల పేర్ల‌ను ఎక్క‌డా బ‌య‌ట‌కు రానివ్వ‌మ‌ని, ఆ మైన‌ర్ల పేర్లు చెపితే వారి జీవితాలు నాశ‌నం అవుతాయ‌ని, బాధిత పిల్లల తల్లదండ్రులను పిలిపించి చెపుతామ‌ని అన్నారు.

ఇక ఇక్క‌డ‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌ని త‌ల్లిదండ్రుల‌కు ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇస్తామ‌ని చెప్పారు. ఏదేమైనా అకున్ వ్యాఖ్య‌లు వ‌ర్మ‌ను టార్గెట్ చేసి కౌంట‌ర్లు ఇచ్చిన‌ట్టుగా ఉన్నాయి.

 

కౌంట‌ర్ల వ‌ర్మ‌కే అకున్ అదిరిపోయే కౌంట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share