ప్రాణ ముప్పుతో డీజీపీను కలిసిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి

October 10, 2018 at 1:38 pm

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చారు. ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నా..ఇచ్చిన హామీలు దేవుడు ఎరుగు..అందిన కాడికి దోచేస్తున్నారు..టీడీపీ మంత్రులు..ఎమ్మెల్యేలు వీరితో పాటు చోటా మోటా నాయకులు. ముఖ్యంగా విశాఖ భూకుంభకోణం…ఇసుక అక్రమ రవాణా…భూకబ్జాలు…వంటి చర్యలతో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఓ వైపు అభివృద్ది అంటూ కాకమ్మ కథలు చెబుతూ..అందినంత దోచుకుంటున్నారు.

అధికార పార్టీ దనదాహానికి ప్రజలు అన్యాయం అవుతున్నారని..ఈ నేపథ్యంలోనే టీడీపీ అవినీతిపై వైఎస్సార్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గత నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నాలుగేళ్లుగా.. రాజధాని భూసమీకరణ – ఓటుకు కోట్లు కేసు – ముఖ్యమంత్రి అక్రమ నివాసం – సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు కొంత మంది నేతల నుంచి..ఇతరుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు..అన్నీ మానుకుంటే బతుకుతావని..లేదంటే..చావు తప్పదని తనను బెదిరిస్తున్నారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు లేఖ రాశారు.

ఈ లేఖను ఆయన స్వయంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు అందజేశారు. అన్యాయాలను ప్రశ్నించినందుకు తనను చాలామంది టార్గెట్ చేశారని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రవాణా అడ్డగోలుగా అవుతుందని..ఇందులో కమీషన్లు పెద్ద తలకాయలకు వెళ్తుందని..అందుకోసం ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదని..దాని వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే కొద్ది రోజుల క్రితం మావోయిస్టుల పేరిట కూడా తనకు బెదిరింపుల లేఖలు వచ్చాయని చెప్పారు. దీంతో తనకు భద్రత పెంచాలని కోరారు.తనకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కనీసం టూ ప్లస్ 2 (2+2) గన్ మెన్ సెక్యూరిటీ అందజేయాలని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రాణ ముప్పుతో డీజీపీను కలిసిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share