ఆళ్ల మార్పు మంచిదే …ఎలాగంటే !

October 9, 2018 at 10:32 am

మార్పు మంచిదే! పార్టీ గెలుపుకోసం.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌యోగాలు, మా ర్పుల‌పై స‌ర్వ‌త్రా వినిపిస్తున్న మాట ఇది. పార్టీ అధికారంలోకి వ‌స్తే.. అంద‌రికీ అన్ని అవకాశాలు వ‌చ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో కొంత కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిని గుర్తించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న పార్టీ నాయకుల‌కు ఇదే బోధిస్తున్నారు. పంతాల‌కు పోవ‌డం వ‌ల్ల పార్టీ అధికారంలోకి రాద‌ని, పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌ట్టు-విడుపులు ప్ర‌ద‌ర్శించ‌డం మంచిద‌ని ఆయ‌న బోధిస్తు న్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మార్పులు జ‌రుగుతున్నాయి. అయితే, ఈ మార్పుల‌ను స‌హించ లేని, లేదా త‌మ‌కు ముప్పు పొంచి ఉంద‌ని భావిస్తున్న అధికార పార్టీ నాయ‌కులు వీటిపై ప్ర‌చారాలు చేస్తున్నారు.32-31423

అయితే, వాస్త‌వానికి ఏ పార్టీలో అయినా గెలుపు గుర్రం కార‌ని తేలితే.. మార్పు చేయ‌డం స‌హజం. మ‌రి అలాంటి స‌మ యంలో అభ్య‌ర్థుల‌ను మార్చుకోక అధినేత ఎవ‌రైనా ఏం చేస్తారు. ఇప్పుడు ఇదే వైసీపీలో కీల‌కంగా మారిపోయింది. దీనిని అధికార పార్టీ భ‌జ‌న ప‌త్రిక‌లు భూత‌ద్దంలో చూపుతూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌నాత్మ‌క క‌థ‌నాలు రాస్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కు పార్టీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని న‌మ్ముకున్న వారిని మెడ‌ప‌ట్టుకుని బ‌య‌ట‌కు గెంటేస్తున్నార‌ని, భారీ ఎత్తున ఓ మీడియా మొస‌లి క‌న్నీరు కారుస్తూ.. పార్టీలో చిచ్చు పెట్టేందుకు చాలా ప్ర‌య‌త్నాలే చేస్తోంది. అయితే, ఇదే ప‌రిస్థితి అధికార పార్టీలోనూ ఉంది. అక్క‌డ మాత్రం గుడ్డి గుర్రాల‌ను ఎన్నాళ్ల‌ని సాకుతారు? Alla-Rama-Krishna-Reddy-Peculiar-Politician-Ever-1

తాజాగా గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి విష‌యం తెర‌మీదికి వ‌స్తోంది. ఆయ‌న‌ను మారుస్తా ర‌నే ప్ర‌చారం ఊపందుకుంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి, సీనియ‌ర్ నాయ‌కుడు గంజి చిరంజీవిపై ఆళ్ల కేవ‌లం 12 ఓట్ల తేడాతోనే విజ‌యం సాధించారు. అయితే, ఇప్పుడు వ‌చ్చే ఏడాది జ‌రుగనున్న ఎన్నిక‌ల్లో చిరంజీవి స్థానంలో టీడీపీ బ‌లమైన అభ్య‌ర్తిని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌తి ఓటు ప్ర‌తి సీటు కీల‌క‌మైన నేప‌థ్యంలో అధికార ఆ దిశగానే అడుగులు వేస్తోంది. దీనికి త‌గిన విధంగా వైసీపీ కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. దీంతోనే ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని మార్పు చేసి.. ఆయ‌న స్తానంలో వేరేవారికి ఛాన్స్ ఇవ్వ‌డం ద్వారా.. తిరిగి ఇక్క‌డ జెండా ఎగుర‌వేయాల‌ని భావిస్తున్నారు. Alla-Ramakrishna-Reddy-YS-Jagan

జ‌గ‌న్ రామ‌కృష్ణారెడ్డి సేవ‌ల‌ను అనేక విధాలా వాడుకోవాల‌ని చూడ‌డంతో పాటు జిల్లాలో ఇప్ప‌టికే మాచ‌ర్ల‌, న‌ర‌సారావుపేట‌, గుర‌జాల‌లో రెడ్డి సామాజిక‌వ‌ర్గం వారికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వ‌డంతో ఇక్క‌డ రామ‌కృష్ణారెడ్డిని మార్చుతున్నారు. అయితే ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌క‌పోయినా ఆళ్ల‌కు జ‌గ‌న్ మంచి ఆప్ష‌న్లు ఇస్తున్నారు. అయితే, ఇక్క‌డ ఎమ్మెల్యే ఆళ్ల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వితోపాటు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని స‌మాచారం. ఏదేమైనా.. మార్పు మంచిదే!!

ఆళ్ల మార్పు మంచిదే …ఎలాగంటే !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share