నీకు నోరున్నా వేస్టే.. అంబ‌టికి జ‌గ‌న్ తలంటు..!

October 10, 2018 at 3:46 pm

అంబ‌టి రాంబాబు. వైసీపీ అధికార ప్ర‌తినిధిగా, కార్య‌ద‌ర్శిగా కూడా గుర్తింపు పొందిన ఆయ‌న వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు. వైసీపీపైనా, జ‌గ‌న్‌పైనా ఎవ‌రు ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా తిప్పికొట్ట‌డంలో ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఏమేర‌కు పార్టీకి ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటున్నారు? ఏమేర‌కు పార్టీకి మేలు చేసే కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మాత్రం మౌనమే స‌మాధానంగా వ‌స్తోంది. త‌న‌దైన సుదీర్ఘ మీడియా స‌మావేశాల‌తో అటు చంద్ర‌బాబు.. ఇటు టీడీపీనేత‌ల‌పై విమర్శ లు సంధించే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు జిల్లా స‌త్తెన ప‌ల్లిలో ఏమేర‌కు గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నార‌ని ప్ర‌శ్నించినా స‌మా ధానం ల‌భించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ambatirambabu--1528990680

టీడీపీలో సీనియ‌ర్ మోస్ట్ అయిన కోడెల ఇక్క‌డ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత కీల‌కం కావ‌డంతో ఈయ‌న‌ను ఓడించే వ్యూహం సిద్ధం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన అంబ‌టి రాంబాబు మ‌ళ్లీ ఇక్క‌డి నుంచే టికెట్ ఆశిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 900 ఓట్ల తేడాతో గెలిచిన కోడెలను నిలువ‌రించేందుకు అంబ‌టి గ‌ట్టిగానే కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో హోరా హోరీగా త‌ల‌ప‌డినా.. ఇప్పుడు మారిన స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో అంబ‌టి మునుప‌టిక‌న్నా ఎక్కువ‌గానే క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. అయితే, ఆయ‌న ఆదిశ‌గా కృషి చేయ‌డం మానేసి కేవ‌లం మీడియాలో క‌నిపించ‌డ‌మే ధ్యేయంగా ఏదో నాలుగు మాట‌లు మాట్లాడేసి పొద్దు వెళ్ల‌బుచ్చుతున్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు కూడా ఆయ‌న పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డం లేద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.

మ‌రోప‌క్క‌, డాక్ట‌ర్ కోడెల మ‌ళ్లీ విజ‌యం కోసం త‌న ప్ర‌య‌త్నాలు తాను ముమ్మ‌రం చేస్తున్నారు. ఎన్టీఆర్ హౌసింగ్, వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల‌ను నిర్మించ‌డం, ర‌హ‌దారులు ఏర్పాటు చేయ‌డం వంటి ప‌నుల‌తో ఒకింత దూసుకుపోతున్నారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఢీకొట్టాలంటే.. అంబ‌టి మ‌రింత వేగంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌క్క‌న పెట్టి.. కేవలం మీడియా ముందుకు వ‌చ్చి కొన్ని మాట‌లు మాట్లాడి స‌రిపుచ్చుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పాద‌యాత్ర చేస్తూనే.. నేత‌ల జాత‌కాలు తిర‌గేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లా పాద‌యాత్ర‌లో ఉండ‌గానే గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అసెంబ్ల నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కుల జాత‌కాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు.Ambati

ఈ సంద‌ర్భంగా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న అంబ‌టిపై త‌న‌కు అందిన నివేదిక‌ను చూసి జ‌గ‌న్ నోరెళ్ల బెట్టారు. అంతేకాదు, ఆయ‌నను అక్కడ‌కు పిలిచి మ‌రీ త‌లంటేశారు. నీకు నోరెక్కువ‌.. నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుడు త‌క్కువ‌- అంటూ తిట్టిపోశారు. వాళ్లు అలా చేస్తున్నారు. వీళ్లు ఇలా చేస్తున్నారు. అంటూ మీడియా గొట్టాల ముందు మాట్లాడ‌తావు కానీ, ప్ర‌జ‌ల్లో ప‌ట్టుమ‌ని ప‌ది గంట‌లైనా తిరిగిన చ‌రిత్ర ఉందా? అని నిల‌దీసేస‌రికి అంబ‌టి ఖిన్నుడై.. నోట మాట కూడా పెగ‌ల్లేద‌ని తెలిసింది. ప‌రిస్థితి ఇలానే ఉంటే.. పార్టీ గెలుస్తుందా? అని కూడా అంబ‌టిని జ‌గ‌న్ నిల‌దీసిన‌ట్టు స‌మాచారం.మ‌రి ఇప్ప‌టికైనా అంబ‌టి అవాకులు, చ‌వాకులు మానేసి త‌న నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెడ‌తాడో లేదో చూడాలి.

నీకు నోరున్నా వేస్టే.. అంబ‌టికి జ‌గ‌న్ తలంటు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share