బాబు హస్తం రాజకీయం..రఘువీరారెడ్డి అవుట్

June 15, 2018 at 10:15 am
ap-congress -

ఇర‌వై రోజులు వెన‌క్కి వెళ్లండి.. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారాన్ని గుర్తుకు తెచ్చుకోండి.. అప్పుడు అక్క‌డొక అపూర్వ దృశ్యం త‌ళుక్కుమంది.. ఎన్న‌డుకూడా.. ఎప్పుడు కూడా క‌లుసుకోని, మాట్లాడుకోని నేత‌లిద్ద‌రూ చేతులు క‌లిపిన సంద‌ర్భం యాదికొచ్చింది క‌దా.. అదేనండీ.. టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీలిద్ద‌రు ప‌ల‌కరించుకుని ముచ్చ‌టించుకోవ‌డం.. 

 

అయితే ఆ నేత‌ల న‌వ్వుల పువ్వుల ప‌రిమ‌ళం ఇప్పుడు ఏపీని కూడా తాకిందా.. అంటే తాజా ప‌రిణామాలు మాత్రం నిజ‌మ‌నే అంటున్నాయి. అతికొద్ది రోజుల్లోనే అవేమిటో స్ప‌ష్టం క‌నిపించే అవ‌కాశం కూడా ఉంది. క‌ర్ణాట‌క‌లో రాహుల్‌గాంధీకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌కుడు స్నేహ‌హ‌స్తం అందించ‌డంపై నిజానికి అప్పుడు పెద్ద దుమారం రేగింది. వైసీపీ నేత‌లు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీకి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌వుతున్నారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు కూడా ఉండే అవ‌కాశాలు ఉన్నాయంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి.. ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. స‌రికొత్త  రాగం.. తానం వినిపిస్తోంది. ఏ

 

కంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డిని ప‌ద‌వి నుంచి త‌ప్పించి, త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌కు ఏపీపీసీసీ చీఫ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టేందుకు చంద్ర‌బాబునాయుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇన్నాళ్లూ.. బీజేపీతో క‌లిసి న‌డిచిన బాబు ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని సాకుగా చూపి, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఎప్పుడు కూడా ఒంట‌రిగా బ‌రిలోకి దిగే అల‌వాటు లేని బాబుగారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త‌హ‌స్తం కోసం వెతుక్కోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ట‌. 

 

ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీని అడ్డంపెట్టుకుని మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని బాబుగారు భారీ స్కెచ్ వేస్తున్నార‌ట‌. ఇందులో భాగంగానే.. త‌న‌కు అనుకూలంగా ఉండే.. త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌కే పీసీసీ చీఫ్ ప‌ద‌వి ద‌క్కేలా ఆయ‌న  ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది.  ఈనేప‌థ్యంలోనే ఈ మ‌ధ్య టీడీపీతోపాటు కాంగ్రెస్ పార్టీని కూడా ప‌చ్చ‌మీడియా నెత్తికొత్తుకోవ‌డం గ‌మ‌నార్హం. 

బాబు హస్తం రాజకీయం..రఘువీరారెడ్డి అవుట్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share