కామావ‌తారం ఎత్తిన మంత్రిగారి పీఏ..!

June 7, 2018 at 3:54 pm
tdp-minister - PA

ఓవైపు ఏపీలో మ‌హిళ‌ల‌పై లైంగిక‌దాడులను అరిక‌ట్టేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతున్నారు.. మ‌రోవైపు అనంత‌పురం జిల్లాలో ఏకంగా మంత్రిగారి పీఏ మాత్రం కామావ‌తారం ఎత్తాడు. ప‌నుల కోసం మ‌గ‌వాళ్లు వ‌స్తేనేమో ఆయ‌న‌కు డ‌బ్బులు ముట్ట‌జెప్పాలి.. మ‌హిళ‌లు వ‌స్తే మాత్రం ఒళ్లు అప్ప‌గించాలంటూ వేధిస్తున్నాడు. మంత్రిగారి అండ‌దండ‌ల‌తో ప‌నుల కోసం వ‌చ్చే ఒంట‌రి మ‌హిళ‌ల‌ను, నిస్స‌హాయ స్థితిలో ఉన్న‌ ఆడ‌వాళ్ల‌ను వాడుకోవ‌డంలో పీఏ రూటే వేర‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఆయ‌న‌పై ఎప్ప‌టి నుంచో ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా.. సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో మంత్రి కూడా చూసీచూడ‌న‌ట్లు ఉంటున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

 

 ఇంత‌కీ ఏం జ‌రిగిందే.. ఓ మహిళా ఉద్యోగి శాఖపరమైన సమస్యతో మంత్రిని క‌లిసేందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే మంత్రిగారు అందుబాటులో లేకపోవడంతో ఓ మధ్యవర్తితో మంత్రి పీఏను కలిసింది. త‌న‌  పని కోసం ఓ లక్ష రూపాయలు కూడా ఆమె ఇస్తానంది. కానీ మంత్రి పీఏ  ఆమె నుంచి అంతకుమించి ఆశించాడు. త‌న కోరిక‌ను తోటి ఉద్యోగికి ఫోన్లో వివరించాడు. ఆ కోరిక తీరిస్తేనే ఆమె పని అవుతుంద‌ని సూటిగా చెప్పేశాడు. ఆయ ఏం జ‌రిగిందో తెలియ‌దుగానీ.. ఇప్పుడా ఆడియో టేపు బయటకు రావ‌డంతో వైర‌ల్ అవుతోంది. జిల్లాలో ఈ ఆడియో టేపు క‌ల‌క‌లం రేపుతోంది. మొత్తంగా మంత్రిగారి ప‌రువును బ‌జారున ప‌డేసింది. 

 

వివిధ ప‌నుల నిమిత్తం మంత్రి వ‌ద్ద‌కు సాయం కోసం వ‌చ్చే మ‌హిళ‌ల గురించి తెలుసుకోవ‌డం.. ఆమె కుటుంబ నేప‌థ్యం.. ఏం చేస్తున్నారు..? ఒంట‌రిగా ఉంటున్నారా..? భ‌ర్త‌తో వేరుగా ఉంటున్నారా..?   మొత్తంగా తోటి ఉద్యోగుల ద్వారా వారి క్యార‌క్ట‌ర్ తెలుసుకొని త‌న కోరిక‌ను బ‌య‌ట‌పెడుతాడు పీఏ. పురుషుల వద్ద నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే పీఏ మహిళలు కనపడితే మాత్రం డబ్బులు తీసుకోడు. చేసిన ప‌నికి ప్రతిగా తన కోరిక‌ తీర్చమంటాడు. తాము చెప్పినట్టు వింటే ప‌ని సాఫీగా జరిగిపోతుందంటూ నమ్మబలికి లోబరుకుంటున్నాడు. ఇప్ప‌టికైనా పీఏపై మంత్రి గారు చ‌ర్య‌లు తీసుకుంటారో లేదో చూడాలి మ‌రి. 

కామావ‌తారం ఎత్తిన మంత్రిగారి పీఏ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share