
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నాయకులు గోబెల్స్ ప్రచారానికి తెర లేపుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకు అన్ని అడ్డదార్లు తొక్కుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీని ఎదుర్కోలేక, ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిపై అసత్య ప్రచారానికి పూనుకున్నారు.
2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎంతో కీలకమయ్యాయి. అయితే ఇటీవల ఈ రెండు జిల్లాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. జనాల్లో మంచి పట్టు సాధించింది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఆయా జిల్లాల్లో పర్యటించిన అనంతరం ఈ విషయాన్ని పసిగట్టారు. ఆయా జిల్లాలకు చెందిన నాయకుల నుంచి నివేదికలు తెప్పించుకుని క్షణ్ణంగా అధ్యయనం చేశారు.
ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో టీడీపీ తీవ్రంగా నష్టపోతుందని, వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుందని ముఖ్యమంత్రి గ్రహించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎదుగదలను ఓర్వలేని చంద్రబాబు, టీడీపీ నాయకులు ఏపీ రాజధాని అమరావతిపై విష ప్రచారానికి తెర లేపారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని ప్రచారం చేస్తూ జనాన్నీ గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని ప్రకాశం లేదా ఒంగోలులో ఏర్పాటు చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఓపక్క రాజధాని నిర్మాణం పజరుగుతుండగా, కార్యాలయాలు కూడా సిద్ధమవుతున్న వేళ రాజధాని తరలింపు అసాధ్యమని తెలిసి కూడా వైసీపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు పథకం ప్రకారం ఈ ఎత్తుగడను ఎంచుకున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన జనాన్ని ఇబ్బందుల పాలు చేసి, తద్వారా ఎన్నికలలో లబ్దిపొందేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారు.