ఏపీలో మారుతున్న పొలిటిక‌ల్ సీన్స్‌.. జోరుగా జంపింగులు

May 7, 2018 at 6:12 pm
andhra pradesh- political partys

ఏపీలో నేత‌ల క‌ప్ప‌దాటుళ్లు పెరిగిపోయాయి. 2019 ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నేతలు ఎవ‌రి సేఫ్టీ వారు చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు టికెట్ ఇస్తే వారికే జై కొట్టేందుకు నేత‌లు సిద్ధంగా ఉన్నారు. ప్ర‌స్తుతం టీడీపీ నుంచి, బీజేపీల నుంచి భారీ ఎత్తున వ‌ల‌స‌లు సాగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిం చిన భంగ ప‌డుతున్న‌వారు ముందుగానే మేల్కొంటున్నారు. చివ‌రి నిముషం దాకా వెయిట్ చేసి తీరా టికెట్ ద‌క్క‌క పోతే నిరాశ‌లో కూరుకుపోయే రోజుల‌కు నేత‌లు చెక్ పెట్టారు.

 

 ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీలో త‌మ‌కు టికెట్ రాద‌ని తెలుసు కున్న నేత‌ల‌కు ఇప్ప‌టికే త‌మ త‌ట్టా బుట్టా సర్దుకున్నారు. వీరిలో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన య‌ల మంచిలి ర‌వి.. ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు. క‌మ్మ వ‌ర్గానికి చెందిన ర‌వి.. తూర్పులో ప్ర‌భావితం చేయ‌గ‌ల నేత‌. అయితే, 2009లో ఇక్క‌డ నుంచి గెలిచిన ఈయ‌న 2014కి టీడీపీలో చేరారు. అయితే, అప్ప‌ట్లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం గ‌ద్దె రామ్మోహ‌న్‌కు కేటాయించ‌డంతో ర‌వి.. తీవ్ర‌స్థాయి లో నొచ్చుకున్నాడు. అయితే, త‌న‌కు 2019లోనైనా టికెట్ ద‌క్కుతుంద‌ని భావించాడు. కానీ, చంద్ర‌బాబు ర‌వి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత‌కు, ర‌వికి మ‌ధ్య రాయ‌బారాలు జ‌రిగినా.. ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ర‌వి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. 

 

ఇక‌, కొంద‌రు బీజేపీ నేత‌లు కూడా వైసీపీలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుత‌న్నా యి. గుంటూరుకు చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీ వైఖ‌రితో విసుగుచెంది.. వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే, చివ‌రి నిముషంలో ఎందుకో బ్రేక్ ప‌డింది. ఇక‌, విశాఖ ప‌ట్నానికి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీకి రాం రాం చెబుతార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నా యి. రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేద‌ని, ఇప్ప‌టికే బ‌ద్నాం అయిపోయింద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి ఓట్లు ప‌డే సీన్ లేద‌ని గ్ర‌హించిన ఆయ‌న వైసీపీలో వెళ్లేందుకు చ‌ర్చ‌లు న‌డిపార‌ని స‌మాచారం. అయితే, ఎందుకో ఇది కూడా ఆగిపో యింది. 

 

అయితే, క‌ర్నూలు జిల్లా పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ సీనియ‌ర్ నేత‌ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి మాత్రం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేస‌మ‌యంలో తిరుప‌తికి చెందిన బీజేపీ నేత కారుమంచి జ‌య‌రాం.. కూడా ఇటీవ‌ల టీడీపీలోకి చేరాడు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఈయ‌న తిరుప‌తి ఎంపీ స్థానం నుంచి బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగారు. తాజాగా.. టీడీపీ నుంచి గుంటూరుకు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా పార్టీ మారేందుకు రెడీగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న త్వ‌ర‌లోనే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నాడ‌ని స‌మాచారం. 

 

ఇక‌, కృష్ణా జిల్లాలో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఆశిస్తున్న టీడీపీ సీనియ‌ర్ కుటుంబానికి చెంద‌ని వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ త్వ‌ర‌లోనే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈయ‌న మంత్రి దేవినేనిపై పోరాటం చేయ‌ను న్నారు. మైల‌వరంలో వసంత ఫ్యామిలీకి మంచి ప‌ట్టుండ‌డంతో దేవినేనికి ఎదురు గాలి వీస్తుంద‌ని అంటున్నారు. ఇలా రాష్ట్రంలోని కీల‌క నేత‌లు, ముఖ్యంగా త‌మ‌కు టికెట్ వ‌స్తుంద‌ని ఆశించి భంగ ప‌డ‌తామ‌ని భావిస్తున్న నేత‌లు ఇప్పుడు ఎన్నిక‌లే ధ్యేయంగా పార్టీలు మారుతుండ‌డం గ‌మ‌నార్హం. 

ఏపీలో మారుతున్న పొలిటిక‌ల్ సీన్స్‌.. జోరుగా జంపింగులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share