ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే ఊరుకోం..టీఆర్ఎస్ పార్టీ

July 19, 2018 at 3:37 pm
AP-Special Status-TRS Party

తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి యూపిఏ ప్రభుత్వం చెప్పిందని..దానికి ప్రతిపక్ష హోదాలో ఉన్న బిజెపి సైతం ఓకే చెప్పిందని..ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏపికి ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఏపీ ప్రజలు, ప్రభుత్వం ముక్తకంఠంతో విమర్శిస్తుంది.  దీనిపై గత కొంత కాలంగా పార్లమెంట్ లో పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తుంది.  తాజాగా కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరితే తాము వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష ఉపనేత బి.వినోద్‌కుమార్‌ తెలిపారు. DSC_8560-e1477050379377-976x768_0

 

విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని, ఈ అంశంలో గతంలో చెప్పినట్లే టీడీపీకి అండగా నిలుస్తామని చెప్పారు.  అయితే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది విభజన చట్టంలో లేదని..అలాంటిది ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వమని కోరం ఎంటని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష ఉపనేత బి.వినోద్‌కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, హైదరాబాద్‌ పరిశ్రమలు విజయవాడకు తరలివెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.Chief-Minister

 

 2014లో తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాశారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కోరారని తెలిపారు. అప్పట్లో కర్ణాటక అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఇలాగే స్పందించారన్నారు.  ఇప్పుడు ఏపి లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని..కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ తమను డిమాండ్‌ చేయడం అర్ధరహితమని, నాలుగేళ్లపాటు టీడీపీ బీజేపీ జట్టు కట్టినప్పుడు తాము దాని గురించి అడగలేదని గుర్తు చేశారు.  ఒకవేళ అవిశ్వాసం అంశం ఓటింగ్‌కు వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. 201803011217319476_Congress-is-like-Alibaba-and-40-thieves-says-KTR_SECVPF

ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే ఊరుకోం..టీఆర్ఎస్ పార్టీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share