అర్జున్‌రెడ్డి హీరోయిన్ శాలినికి తీవ్ర అస్వ‌స్థ‌త‌…బొల్లినేని హాస్ప‌ట‌ల్లో చికిత్స‌

September 13, 2017 at 7:47 am
Arjun reddy, Shalini

అర్జున్‌రెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా తెలుగు సినీ అభిమానుల నోళ్ల‌లో నానుతోన్న హీరోయిన్ శాలినీ పాండే ఈ రోజు తీవ్ర‌ అస్వస్థతకు గురైంది. అర్జున్‌రెడ్డి సినిమాతోనే ఆమెకు మంచి ఇమేజ్ రావ‌డంతో ఆమెకు ప‌లు పెద్ద సినిమాల్లో ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె చేత కొంద‌రు షాపింగ్ మాల్స్‌, సెల్ పాయింట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే శాలినీ పాండే ఈ రోజు నెల్లూరులో ఓ సెల్‌పాయింట్ ప్రారంభించడానికి వెళ్లింది.

ఆమె అక్క‌డ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ఆమెను దగ్గర్లోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ వైద్యులు ఆమెకు గంటపాటు చికిత్స అందించారు. అనంతరం ఆమెను స్ట్రైచర్‌పై తీసుకెళ్లి కారులో ఎక్కించి పంపించారు. స్ట్రైచర్‌పై తీసుకెళ్లే సమయంలో ఆమె శరీరం ఏ మాత్రం కనిపించకుండా ముఖంతో సహా తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచడం గమనార్హం.

ఇక అర్జున్‌రెడ్డి సినిమా హీరోయిన్ వ‌చ్చింద‌న్న విష‌యం తెలిసిన వెంట‌నే బొల్లినేని హాస్ప‌ట‌ల్‌కు ఇత‌ర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున జ‌నాలు చేరుకున్నారు. ఇక హాస్ప‌ట‌ల్‌కు అర్జున్‌రెడ్డి హీరోయిన్ వ‌చ్చింద‌న్న విష‌యం తెలియగానే ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు ఆమెతో ఫొటోలు తీసుకొనేందుకు ప్రయత్నించారు. కాగా అంత‌కు ముందు ఆమె నెల్లూరుకు కారులో వెళుతూ తాను నెల్లూరుకు వస్తున్నానంటూ ఓ సెల్ఫీ వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది శాలినీ.

 

 

అర్జున్‌రెడ్డి హీరోయిన్ శాలినికి తీవ్ర అస్వ‌స్థ‌త‌…బొల్లినేని హాస్ప‌ట‌ల్లో చికిత్స‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share