కూట‌మిపై అస‌దుద్దీన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

November 20, 2018 at 1:19 pm

తెలంగాణ ఎన్నిక‌లు కాక‌పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ నేత‌`త్వంలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐలు ప్ర‌జాకూట‌మిగా ఏర్ప‌డ‌గా.. అధికార టీఆర్ఎస్ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతోంది. అయితే.. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మాత్రం ఎంఐంతో కేసీఆర్ ఫ్రెండ్లీ పోటీకి సిద్ధ‌మ‌య్యారు. ఇక ఎంఐఎం, టీఆర్ఎస్ మ‌ధ్య స‌త్సంబంధాలు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాల‌ని ఎంఐఎం నేత‌లు బ‌హిరంగంగానే చెబుతున్నారు. కేసీఆర్ పాల‌న‌కు జేజేలు ప‌లుకుతున్నారు. కేసీఆర్ పాల‌న‌లోనే తెలంగాణ అభివ‌`ద్ధి చెందుతోంద‌ని, ఆయ‌న‌తోనే బంగారు తెలంగాణ సాధ్య‌మ‌వుతుంద‌ని స‌భ‌లు, స‌మావేశాల్లోనూ ప్ర‌క‌టిస్తున్నారు.46453203_2026859074048160_61971529063202816_n

అయితే.. తాజాగా ఎంఐఎం కీలకనేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మల్ సభలో ప్ర‌జాకూట‌మి నేత‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌కలం రేపుతున్నాయి. సభకు రావొద్దని కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి తనకు రూ.25లక్షలు ఆఫర్ చేశారని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోన్‌కాల్ రికార్డు తన వద్ద ఉందని ఆయన ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలూ బయటపెడతానని అసదుద్దీన్ స్పష్టం చేశారు. అసద్‌ను ఎవరూ కొనలేరని, ముస్లింలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనైతిక పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసం చేయాలని నిర్ణయించుకుందని ఆయ‌న ఆరోపించారు.States-Oct1-5

కాంగ్రెస్, టీడీపీల కలయికతో ఏర్పడిన ప్రజా కూటమికి ప్రజలు బుద్ధి చెప్పాలని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలి అని అసదుద్దీన్‌ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో ఎంఐఎం నేత‌లు బ‌రిలోకి దిగిన చోట టీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థుల‌ను కూడా పోటీకి దింపినా.. అది ఉత్తిత్తి పోటీ అని ఎప్పుడో తేలిపోయింది. ఆయా స్థానాల్లో ఎంఐఎం అభ్య‌ర్థుల‌ను గెలిపించ‌డానికి టీఆర్ఎస్‌కు స‌హ‌క‌రిస్తుంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ఎంఐఎం నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. అస‌దుద్దీన్ ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఏలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

కూట‌మిపై అస‌దుద్దీన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share