టీడీపీ ఎంపీకి కాపుల భ‌యం.. ఎందుకంటే..

July 19, 2018 at 11:53 am
Avanthi Srinivas-TDP-MP

ఎంపీ అవంతి శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ ముత్తంశెట్టి శ్రీనివాస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పొంద‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అవంతి.. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎంపీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌డం అంత ఈజీ కాద‌ని తేలిపోతోంది. విశాఖ జిల్లాలో కీలకమైన అనకాపల్లి లోక్‌సభ స్థానం ఇప్పుడు అవంతికి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.  ఈ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజికవ‌ర్గ‌మే నేత‌ల‌ను డిసైడ్ చేస్తోంది. అవంతి శ్రీనివాసరావు ఇదే సామాజికవర్గానికి చెందినా, ఆయన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ కి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. Avanthi2TDP

 

ఈ నేపథ్యంలో పూర్తిగా ఏడు గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల సమాహారంగా ఉన్న అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి అవంతి త‌ప్పుకొన్న‌ట్టేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డి ఎన్నిక‌లు కాపు ఓటు బ్యాంకుపైనే ఆధారపడి ఉన్నాయ‌నేది వాస్త‌వం. దీంతో కాపుల‌ని ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే టీడీపీ కాపు సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. విదేశీ రుణాలు అందిస్తోంది. కాపుల‌కు ప్ర‌త్యేకంగా విద్యోన్న‌తి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ..  కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌పై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌ నివేదిక వివాదాస్పదంగా మారడంతో ఇక్క‌డ కాపులు టీడీపీని ఓడించేందుకు రెడీ అయ్యారు. Avanthi-Srinivas

 

ఈ విష‌యం తెలుసుకున్న అవంతి.. వెంట‌నే త‌న త‌ట్టాబుట్టా స‌ర్దుకున్నారు. ఇక‌, ఆయ‌న ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన విశాఖ రైల్వే జోన్ విష‌యం ఒక అడుగు కూడా ముందుకు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా పూర్తిగా కాపు ఓటు బ్యాంకు ఆధారంగా రాజకీయాలు నడుపుతున్న బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అదే సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు కట్టబెట్టింది. బీసీ సామాజిక వర్గాల కంటే కాపు ఓటు బ్యాంకును దక్కించుకునేందుకే ప్రధాన పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. గతంలో బీసీ సామాజికవర్గాలకు చెందిన పెతకంశెట్టి అప్పల నర్శింహం, కొణతాల రామకృష్ణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు, సబ్బంహరి వంటి వారు అనకాపల్లి ఎంపీలుగా గెలుపొందారు. 32-532523

 

అయినప్పటికీ ఈ లోక్‌సభ స్థానం పరిధిలో గల అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీసీలతో పాటు కాపులు కూడా తగినంత మంది ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అవంతి గెలుపు అంత ఈజీ కాద‌నే నేప‌థ్యంలో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమిలి లేదా మ‌రో నియోజ‌క‌వ‌ర్గం కేటాయించాల‌ని కోరుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. 

టీడీపీ ఎంపీకి కాపుల భ‌యం.. ఎందుకంటే..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share