బాలయ్యకు జగన్ ఫస్ట్ పంచ్

December 8, 2018 at 4:24 pm

ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌క‌పోతే.. రాజ‌కీయ‌మే లేదు. త‌ల‌త‌న్నేవాడుంటే. వాడి తాడి త‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడ‌న్న విధంగా రాజ‌కీయాలు ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాత్మ‌కంగా మారిపోతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ప‌రిణామ‌మే.. ఇప్పుడు అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకోనుంది. హిందూపురం అంటేనే తెలుగు దేశం పార్టీకి కంచుకోట‌. అన్న‌గారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ వేరే పార్టీ అనేదే గెల‌వ‌లేదు,. పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు నుంచున్నా.. వారికే ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నారు. అలాంటి హిందూపురం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ పోటీ చేసి విజ‌యం సాధించారు.

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని టీడీపీ కంచుకోట‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్న వైసీపీ అదినేత జ‌గ‌న్‌. హిందూపురంపై కూడా క‌న్నేశారు. ఇక్క‌డ బాల‌య్య‌కు చెక్ పెట్ట‌డం ద్వారా అటు టీడీపీకి కూడా భారీ ఎత్తున దెబ్బ‌కొట్టి న‌ట్టు అవుతుంద‌ని వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ వైసీపీ ఇంచార్జిగా ఉన్న న‌వీన్ నిశ్చ‌ల్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్క‌న పెట్టి.. ఇక్క‌డ ఉంచి అబ్దుల్ ఘ‌నీకి టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి ఈ ప‌రిణామం.. న‌వీన్‌కు ఇబ్బంది క‌ర‌మే. ఎందుకంటే.. వైసీపీనే అంటిపెట్టుకుని, విజ‌యం కోసం పాకులాడుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో నిజానికి బాల‌య్య హ‌వాకు అక్క‌డ ఆయ‌నకు ల‌క్ష పైచిలుకు ఓట్ల మెజారిటీ వ‌స్తుంద‌ని భావించారు

కానీ నిశ్చ‌ల్ ఊపుతో బాల‌య్య‌కు కేవ‌లం 16 వేల మెజారిటీ మాత్ర‌మే ల‌భించింది అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘ‌నీని రంగంలోకి దింప‌డం ద్వారా.. హిందూపురంలో ఎక్కువ‌గా ఉన్న‌ ముస్లిం వ‌ర్గాన్ని వైసీపీవైపు మ‌ళ్లించ‌గ‌లిగే శ‌క్తి ఘ‌నీకి ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు మారుతాయ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. హిందూపురం శాసనసభకు 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన అబ్దుల్ ఘనీ.. 2014లో బాలకృష్ణ కోసం సీటు వదులుకున్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పిన అబ్దుల్ ఘనీ.. నాలుగేళ్ల వరకు టీడీపీలోనే కొనసాగారు. వైసీపీలో చేరితే ఎమ్మెల్యే సీటు వస్తుందని అనుచరులు చెప్పడంతో కొద్ది రోజుల నుంచి టీడీపీకి దూరంగా ఉన్నారు. అనుకున్న ప్రకారమే నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక్క‌డ వైసీపీ ఇంచార్జ్ న‌వీన్‌ను జ‌గ‌న్ కొంచెం లైన్ చేయ‌గ‌లిగితే.. ఇక్క‌డ ఘ‌నీకి గెలుపు ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.Hindupur ex mla abdul gani joins ysrcp

బాలయ్యకు జగన్ ఫస్ట్ పంచ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share