కోపంలో వంద అంటాం..నిజంగా గొంతు కోసుకుంటామా..బండ్ల గ‌ణేష్‌

December 18, 2018 at 1:44 pm

కాంగ్రెస్ నేత‌, ప్ర‌ముఖ సినీనిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ ఎట్ట‌కేల‌కు అజ్ఞాతం వీడారు. ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ గెలుస్తుంద‌ని బ‌ల్ల‌గుద్ది చెప్పారు. కాదు కాదు..కాంగ్రెస్ గెల‌వ‌క‌పోతే గొంతు కోసుకుంటానంటూ ఓ టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రిపోర్ట‌ర్‌కే చాలెంజ్ విసిరారు. పాపం ప్చ్‌..కాంగ్రెస్ ఓడిపోవ‌డంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కి రాలేదు..స‌ద‌రు రిపోర్ట‌ర్ మాత్రం బండ్ల గ‌ణేష్ ఇంటి ఎదుట 7క్లాక్ బ్లేడ్ ప‌ట్టుకుని కాపు కాసాడు. ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బ‌య‌ట‌కి వ‌స్తాడు…బండ్ల గ‌ణేష్ను నిల‌దీద్ద‌మా..? అన్న‌ట్లుగా ఆ రిపోర్ట‌ర్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ఇక కాంగ్రెస్ ఘోర ప‌రాభావం చ‌వి చూడ‌టంతో బండ్ల గ‌ణేష్ గ‌త వారం రోజులుగా ఆయ‌న ఇంటి నుంచి బ‌య‌ట అడుగుపెట్ట‌లేద‌ట‌. ఈ లోపు దాదాపు కాంగ్రెస్ నేత‌ల్లో ఎవ‌రికి జ‌ర‌గ‌నంత డ్యామేజ్ ఆయ‌న‌కు జరిగిపోయింది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై జోకులు..సెటైర్లు తెగ పేలిపోయాయి.

ఏ వెబ్‌సైట్లో చేసిన ఆయ‌న‌పై క‌థ‌నాలు త‌ప్ప‌క ద‌ర్శ‌న‌మిచ్చాయి. టీవీ చాన‌ళ్ల హంగ‌మా..చ‌ర్చ‌లు..వార్త‌లు మాములుగా హ‌డావుడి జ‌ర‌గ‌లేదు. సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోలింగ్ అయ్యారు. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం వైకుంఠ ఏక‌దాశిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న తిరుప‌తిలోని ప్ర‌ముఖ ఆల‌యంలో దైవ‌ద‌ర్శ‌నం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక మాట్లాడండి సార్ అంటూ మీడియా వాళ్లు స‌ర‌ద‌గా వ్యాఖ్య‌నించ‌డంతో మేం మాట్లాడేట్లు ఉందా సార్ అంటూ అంతే స‌ర‌ద‌గా కామెంట్ చేశారు. ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు అన్న ప్ర‌శ్న‌కు నేనేం అజ్ఞాతంలోకి పోలేదు. భారీ విజ‌యం సాధిస్తునుకున్న మా పార్టీ అనేక చోట్ల ఓడిపోయింది. తీవ్ర బాధ‌లో ఉన్నాను. అందుకే ఇంటి నుంచి బ‌య‌ట‌కి రాలేక‌పోయాను. కోపంలో వంద చెబుతాం..నిజంలో అవ‌న్నీ చేయ‌లేం. నిజంగా గొంతు కోసుకోలేం క‌దా అంటూ న‌వ్వుతూ చెప్పారు. మీరు ఇప్పుడు కోసుకోమంటే మాత్రం త‌ప్ప‌కుండా కోసుకుంటా నంటూ త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌నించారు. అయితే పార్టీ నేత‌గా త‌న కాన్ఫిడెన్స్ మాత్రం ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌గా మారింద‌ని మాత్రం ఒప్పుకున్నారు. పాపం బండ్ల గ‌ణేష్ క‌థ అలా మారింది..ప్చ్‌. ఏం చేస్తాం..

నోటికి ఎంతోస్తే అంత కాకుండా.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిద‌న్న గుణ‌పాఠం బండ్ల గ‌ణేష్ ఎపిసోడ్ నుంచైనా కొంత‌మంది నేత‌లు నేర్చుకుంటే మంచిద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, జ‌నాలు గుర్తు చేస్తున్నారు.

కోపంలో వంద అంటాం..నిజంగా గొంతు కోసుకుంటామా..బండ్ల గ‌ణేష్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share