మంత్రి అఖిలప్రియ ఎంగేజ్‌మెంట్‌… వ‌రుడు ఎవ‌రో తెలుసా!

May 12, 2018 at 3:21 pm
akhila-priya-enggagement

ఏపీ ప‌ర్యాట‌క శాఖా మంత్రి భూమా అఖిల‌ప్రియ ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియా ద్వారానే బ‌య‌ట‌కు లీక్ అయ్యాయి. వాస్త‌వానికి అఖిల‌కు గ‌తంలోనే వివాహం జ‌రిగింది. ఓ కుమార్తె కూడా అఖిలకు ఉంది. వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ మేన‌మామ‌, క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న‌యుడితో ఆమెకు ముందుగా వివాహం జ‌రిగింది.

 

అయితే వారిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో కొద్ది రోజుల‌కే వాళ్లు విడిపోయారు. ఆ త‌ర్వాత ఆమె తల్లి శోభ హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆళ్ల‌గ‌డ్డ నుంచి ఏక‌గ్రీవంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. త‌ర్వాత తండ్రి భూమా నాగిరెడ్డితో క‌లిసి ఆమె టీడీపీలోకి జంప్ చేసేశారు. అనుకోని ప‌రిస్థితుల్లో భూమా కూడా చ‌నిపోవ‌డంతో ఆమెకు బాబు త‌న కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు.

 

ఇలా అనుకోకుండా చిన్న వ‌య‌స్సులోనే అఖిల ఇటు ఎమ్మెల్యే అవ్వ‌డంతో పాటు మంత్రి కూడా అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకోవ‌డంతో ఆమె ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 

 

ఇంత‌కు వ‌రుడు ఎవ‌రో కాదు మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు అల్లుడు భార్గ‌వ్‌. భార్గ‌వ్ ఇటు మంత్రి నారాయ‌ణ‌కు కూడా స‌మీప బంధువు అవుతాడ‌ని తెలుస్తోంది. ఈ లెక్క‌న చూస్తే ఆమె రాజ‌కీయంగా బ‌ల‌మైన ఫ్యామిలీకి ద‌గ్గ‌రి బంధువే కానుంది. అఖిల‌ప్రియ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కాగా… భార్గ‌వ్ కాపు వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డం విశేషం. అయితే త‌న కేబినెట్‌లో మంత్రిగా ఉన్న మ‌హిళ ఎంగేజ్‌మెంట్‌కు చంద్ర‌బాబు హాజ‌రు కాలేదా ?  లేదా పిల‌వ‌లేదా ? అన్న‌ది స‌స్పెన్స్‌.01474412BRKAKHILA2

మంత్రి అఖిలప్రియ ఎంగేజ్‌మెంట్‌… వ‌రుడు ఎవ‌రో తెలుసా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share