టీడీపీకి అఖిల ప్రియ గుడ్‌బై…!

January 10, 2019 at 10:24 am

మంత్రి అఖిల ప్రియ విష‌యంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నేత‌లు ఊహించిన‌ట్లుగానే జ‌రిగింది. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు అన్ని విధాలుగా ఆమె ప్రిపేరైన‌ట్లుగా తెలుస్తోంది. త‌న అనుచ‌రుల‌ను కావాల‌నే టార్గెట్ చేసిన పోలీస్ అధికారులు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా వారి ఇళ్ల‌ల్లో కార్డ‌న్ సెర్చ్ నిర్వ‌హించ‌డంపై మంత్రి అఖిల ప్రియ అల‌క‌బూనిన విష‌యం తెలిసిందే. ఏమాత్రం జంకు బెంకు లేకుండా సూటిగా స్ప‌ష్టంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక కామెంట్లు చేసింది. ఎవ‌రో ఇచ్చిన త‌ప్పుడు స‌మాచారాన్ని బ‌ట్టి అర్ధ‌రాత్రి వేళల్లో త‌న అనుచ‌రుల ఇంట్లో సొదాలు నిర్వ‌హించ‌డంపై ఆమె తీవ్రంగా మ‌న‌స్తాపం చెందారు. ఈ ఎపిసోడ్ త‌ర్వాత ఆమె గ‌న్‌మెన్ల‌ను ఎస్కార్ట్‌ను తిర‌స్క‌రించారు.33131007_990427774451005_1587628858465583104_n

నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆమె ప్ర‌జ‌లే నాకు శ్రీరామ ర‌క్ష అంటూ కామెంట్ చేశారు. ప్ర‌భుత్వంపై మాత్రం ఆమెకు కోపం త‌గ్గ‌లేదు. గౌర‌వం త‌గ్గింద‌ని అభిప్రాయాన్ని ఆమె స‌న్నిహితుల వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కూడా ఆమెను పిలుపిచ్చి మాట్లాడ‌లేదు. దీంతో ఆమెలో మ‌రింత కోపం గూడుక‌ట్టుకుంది. అందుకే స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబే క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించిన ఆమె హాజ‌రుకాలేదు. దీంతో ఆమె పార్టీ వీడుతున్నార‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వెలువ‌డుతోంది. స్వ‌త‌హాగా అఖిల ప్రియ చాలా ప‌ట్టుద‌ల మ‌నిషి. అనుకున్న‌ది అనుకున్నట్లుగా కావాల‌ని భీష్మించుకుని కూర్చుంటుంది. పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నాకే ఆమె కార్డ‌న్ సెర్చ్ ఊదంతాన్ని ఆస‌రాగా చేసుకుని బ్లేమ్ చేసేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ని కొంత‌మంది చెబుతున్నారు.18519583_824221194393068_4069381814176918668_n

ఇదిలా ఉండ‌గా ఆమెను బుజ్జ‌గించేందుకు గాని…చ‌ర్చ‌లు జ‌రిపేందుకు గాని నేత‌లెవ‌రూ ముందుకురాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే హోంమంత్రి మాత్రం చంద్ర‌బాబు ఆమెను పిలిపించి మాట్లాడ‌నున్నార‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. ఓ సీనియ‌ర్ మంత్రిని జిల్లా నేత‌లు సంప్ర‌దించి ఆమెతో మాట్లాడి విష‌యం స‌ద్దుమ‌ణిగేలా చూడాల‌ని అన్నార‌ట‌. ఇందుకు ఆయ‌న సారీ…ఆమె వినే ర‌కం కాదు… న‌న్ను వ‌దిలేయండి అంటూ కామెంట్ చేశార‌ట‌. వాస్త‌వానికి అఖిల ప్రియ చాలా ప‌ట్టుద‌ల మ‌నిషి. ఇప్పుడు ఆమె పార్టీలో కొన‌సాగాలంటే స్వ‌యంగా చంద్ర‌బాబు బుజ్జ‌గిస్తే త‌ప్పా ఆమె దిగిరావ‌డం క‌ష్టమేన‌ని..లేదంటే ఆమె పార్టీని వీడేందుకు ఏమాత్రం సందేహించార‌నే అభిప్రాయాన్ని ఆమె వ‌ర్గీయులు వెల్ల‌డిస్తున్నారు.

టీడీపీకి అఖిల ప్రియ గుడ్‌బై…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share