కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ ఆఫ‌ర్ వింటే.. నివ్వెర పోవాల్సిందే!

May 16, 2018 at 2:02 pm
bjp- offer

క‌ర్ణాట‌క‌లో ప్ర‌లోభాల‌కు తెర‌లేచింది. అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించినా.. మేజిక్ ఫిగ‌ర్ 113ను చేరుకోక పోవ‌డంతో బీజేపీకి ముచ్చెమ‌ట‌లు పడుతున్నాయి. మ‌రోప‌క్క‌, పూర్తిగా సీట్లు కోల్పోయి కేవ‌లం 78 స్థానాల‌కే ప‌రిమిత‌మైన కాంగ్రెస్ మ‌రో సారి ప్ర‌బుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ఉబ‌లాట‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే త‌మ వైరి ప‌క్షంమే అయిన‌ప్ప‌టికీ జేడీ ఎస్‌తో అంట‌కాగేందుకు రెడీఅయి గ‌వ‌ర్న‌ర్‌ను సైతం క‌లిసింది. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క రాజ‌కీయాలు ర‌సకందా యంలో ప‌డ్డాయి. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాల‌ని గ‌ట్టిపై అటు కాంగ్రెస్‌, ఇటు బీజీపీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్ర‌మంలో త‌మ‌కు ఓ ప‌ది మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంటే ప్ర‌భుత్వ ఏర్పాటు త‌థ్య‌మ‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. 

 

ఈ క్ర‌మంలోనే బీజేపీ నేత‌లు.,. ఇత‌ర పార్టీల నుంచి గెలుపొందిన వారికి వ‌ల విసురుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధానంగా ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌లో చీలిక తెచ్చి.. రెండు వ‌ర్గాల్లో ఒక దానిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. లేదా జేడీఎస్ నుంచి వ‌చ్చేవారికి భారీ ఎత్తున న‌జ‌రానాల‌ను స‌మ‌ర్పించేందుకు సైతం రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. ఇదే విష‌యంపై తాజాగా జేడీఎస్ రాష్ట్ర చీఫ్‌.. హెచ్‌డీ కుమార‌స్వామి స్పందించారు. జేడీ ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, కేబినెట్‌ మంత్రి పదవి ఆఫర్ చేస్తోంద‌ని తెలిపారు.  జేడీఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. 

 

అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ  ‘ఆపరేషన్‌ కమల్‌’  విజయవంతమైందని బీజేపీ నేతలు సంబరపడు తున్నా రు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో రావడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. బీజేపీ తమ పార్టీ నుం చి ఒక్క ఎమ్మెల్యేను లాక్కుంటే.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని హెచ్చరించారు. ఎమ్మె ల్యేల బేరసా రాలకు తెరతీసేలా గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సూచించారు. ఉత్తరాదిలో విజయ వంతంగా సాగిన బీజేపీ అశ్వమేధ యాగానికి కర్ణాటకలో ఫుల్‌స్టాప్‌ పడిందని, కర్ణాటక ఫలితాలు బీజేపీ అశ్వమేధ యాగాన్ని అడ్డుకు న్నాయని  వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. 

 

ముందుగా నిర్ణయించిన ప్రకారం కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. జేడీఎస్‌లో చీలిక వస్తుందని తప్పుడు ప్రచారం చేశారని, తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ ప్రచారం వల్ల బీజేపీకి 104 స్థానాలు రాలేదని, సెక్యూలర్‌ ఓట్లు చీలడం వల్లే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మోదీ, బీజేపీ గెలుపు కాదని అన్నారు. బీజేపీ అధికారం కోసం వెంపర్లాడుతోందని, తమ పార్టీని చీల్చాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. అధికార బలంతో ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని, ఐటీ దాడులు చేయిస్తూ.. వారిని ఆందోళనకు గురిచేయాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ ఆఫ‌ర్ వింటే.. నివ్వెర పోవాల్సిందే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share