బీజేపీ లెక్క‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌ని టీడీపీ..!

October 18, 2018 at 11:51 am

నిజానికి ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చే టీడీపీ నాయ‌కులు తాజాగా మాత్రం మీడియాకు దూర‌మ‌య్యారు. తాజాగా విజ‌య‌వాడ వ‌చ్చిన బీజేపీ నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. టీడీపీని క‌డిగి పారేశారు. నిజానికి ఈ రేంజ్‌లో రాజ్‌నాథ్ టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే గ్రాంటును 32 నుంచి 42 శాతానికి పెంచామ‌ని, దీనివల్ల ఏపీకి రూ.2,07,910 కోట్లు వచ్చాయ‌ని, బయటి నుంచి నిధులు తీసుకునే ప్రాజెక్టులకు రూ.1,444 కోట్లు కేటాయించామ‌ని, మరో రూ.20 వేల కోట్ల అంచనా విలువ ఉన్న ప్రాజెక్టులు మంజూరు దశలో ఉన్నాయ‌ని, వీటిని ఎలా పూర్తిచేయాలనేదానిపై చంద్రబాబు దృష్టి పెట్టకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, కేంద్రాన్ని విమ‌ర్శిస్తే ఏం వ‌స్తుంద‌న్న రీతిలో రాజ్‌నాథ్ స్పందించారు.44174436_2223637297877382_8505310022438223872_n

అదేస‌మ‌యంలో ఆయ‌న మ‌రింత దూరం కూడా వెళ్లారు. చంద్రబాబు కాంగ్రెస్‌ ఉచ్చులో పడ్డారు. కాంగ్రెస్‌ చరిత్ర చూసు కుంటే.. ఆ పార్టీ ఉచ్చులో పడినవారు తర్వాత తెరమరుగైపోయారు. కాంగ్రెస్‌ నేడు అంతిమశ్వాస తీసుకుంటోంది. అయి తే చంద్రబాబు ఆ పార్టీని వెంటిలేటర్‌ మీద పెట్టి కొంతకాలం బతికించాలని చూస్తున్నారు. ఆ పార్టీ బతికే పరిస్థితి లేదు అన్నారు. చంద్రబాబు ఎన్‌డీఏ భాగస్వామి అని, ఆయన ఎందుకు కూటమిని వదిలిపెట్టి వెళ్లారో తనకు ఈ రోజుకూ అర్థం కావడం లేదని చెప్పారు. మొత్తానికి ఈ విమ‌ర్శ‌లు రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే ఇటీవ‌ల కాలంలో కేంద్రం నుంచి అధికారికంగా వ‌చ్చి ఎవ‌రూ కూడా ఈ రేంజ్‌లో కేంద్రం ఏపీకి చేస్తున్న సాయంపై ఏక‌రువు పెట్టిన వారు కానీ, పెడుతున్న‌వారు కానీ క‌నిపించ‌లేదు.44123849_2223653074542471_6565249895853195264_n

దీంతో తాజాగా చంద్ర‌బాబు ప్రభుత్వం కౌంట‌ర్ ఇస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా బీజేపీ జాతీయ నేత చేసిన వ్యాఖ్య‌ల‌పై బాబు అండ్ కో మౌనం వ‌హించింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ నాయ‌కులు చేసిన కామెంట్లు నిజ‌మేనేమో? అనేలా నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్త‌వానికి బీజేపీ నుంచి కానీ, వైసీపీ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన ప్పుడు సాధార‌ణంగానే టీడీపీ నుంచి ప్ర‌భుత్వ విప్‌లు, అధికార ప్ర‌తినిధులు స్పందించ‌డం, కౌంట‌ర్లు విస‌ర‌డం కామ‌న్‌. కానీ, తాజాగా ప‌రిణామంలో మాత్రం ఏ ఒక్కరూ నోరు విప్ప‌లేదు. అంటే.. ఏమై ఉంటుంది? అనేది ప్ర‌ధాన విష‌యం. వాస్త‌వానికి రాజ‌ధాని నిర్మాణానికి విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేర‌కు కేంద్రం నుంచి నిధులు అందుతూనే ఉన్నాయి. కానీ, చంద్ర‌బాబు ఈ నిధుల‌ను తాత్కాలిక భ‌వ‌న నిర్మాణాల‌కు ఖ‌ర్చు చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇత‌ర విష‌యాల్లోనూ ఆయ‌న వ్య‌వ‌హార శైలి వివాదాస్ప‌ద మ‌వుతూనే ఉంది. మ‌రి ఈ విష‌యంపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో చూడాలి.

బీజేపీ లెక్క‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌ని టీడీపీ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share