భాజపా జాబితా చివరిదాకా తేలదంతే!

September 11, 2018 at 12:29 pm

తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరుగుతున్న ఎన్నికల్లో తెరాస లాగానే, ఒంటరిగానే అన్ని బరిలోకి దిగుతున్న ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కానీ ఈ రెండు పార్టీలకు మధ్య హస్తి మశకాంతరం అంతటి వ్యత్యాసం ఉంది. తెరాస అసెంబ్లీని రద్దు చేసిన గంటలోపుగానే మొత్తం 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. భారతీయ జనతా పార్టీ బహుశా నామినేషన్ గడువు ముగిసే చిట్టచివరి నిమిషం వరకూ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తూనే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.24HYLAXMANBJP

అభ్యర్థుల విషయంలో తెరాసకు ఒక ఎడ్వాంటేజీ ఉంది. వారు ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో భాజపా తప్ప తతిమ్మా పార్టీలన్నిటికీ పొత్తులనేవి మెడకు గుదిబండ లాంటివి. ఏయే పార్టీలు పొత్తుల్లో కలుస్తాయో ముందుగా తేలాలి. వారికి అసంతృప్తి కలగకుండా ఎన్నెన్ని స్థానాలు కేటాయించాలో తేలాలి. అదే సమయంలో ప్రతి పార్టీకి వారు కీలకంగా కోరుకునే స్థానాలు దక్కడం కూడా తప్పనిసరి. ఇన్ని రకాల గండాలను దాటుకుని వారు అభ్యర్థుల జాబితాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ పార్టీలు మాత్రం ఆ పనిలో చురుగ్గానే ఉన్నాయి. ఇకపోతే.. ‘పొత్తు ఉండదు’ అనే పాయింట్ తెరాసకు ఎడ్వాంటేజీగా మారుతుండగా.. అదే పాయింటు భాజపాకు మాత్రం డిసడ్వాంటేజీగా మారుతోంది. అవును పొత్తులు లేకపోవడం వలన.. వారు చిట్టచివరి నిమిషం వరకు అభ్యర్థులను సాగదీసే ప్రమాదం కనిపిస్తోంది.dc-Cover-pj91fmloshuhm42h6esn9jnh25-20170220120748.Medi_1533222918

భారతీయ జనతా పార్టీ.. ఏదో పరువు నష్టానికి భయపడి మొత్తం 119 స్థానాలకు పోటీచేయాలని అనుకుంటున్నదే తప్ప.. నిజానికి ఆ పార్టీకి అంత బలం లేదు. వాస్తవంగా అయితే.. పార్టీ అంతర్గత అంచనాల ప్రకారం.. 35 స్థానాల్లో పరిస్థితి మెరుగ్గా ఉన్నదని, కాస్త కష్టపడితే.. గత ఎన్నికలకంటె ఎక్కువ సీట్లు దక్కుతాయని వారు అనుకుంటున్నారు.

అయితే మిగిలిన 84 స్థనాలకు అభ్యర్థుల వెతుకులాట ఎలాగ? అనేది వారికి చాలా పెద్దసమస్య. వీటిలో మెజారిటీ నియోజకవర్గాల్లో వారు తలకిందులుగా తపస్సు చేసినా సొంత పార్టీ నుంచి అభ్యర్థిని వెతుక్కోలేని స్థితిలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్, తెరాస, తెలుగుదేశం వంటి పార్టీల్లో టికెట్లు దొరకకుండా అసంతృప్తికి గురయ్యే వారంటే.. వారిని తమలో చేర్చుకుని తాము టికెట్ ఇచ్చి నిలబెట్టాలని అనుకుంటున్నారు. అంటే వారి వ్యూహం ప్రకారం.. తతిమ్మా అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ఫైనలైజ్ చేసేసే దాకా, అసంతృప్తులను ఆహ్వానించి… తాయిలాలు ప్రకటించేదాకా.. భాజపా జాబితా ఫైనలైజ్ కాదన్నమాట. పాపం.. ‘అన్ని స్థానాలకూ పోటీచేసినట్లుగా’ బిల్డప్ ఇవ్వడం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా!!

భాజపా జాబితా చివరిదాకా తేలదంతే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share