బాబు నిర్ణ‌యంతో బుట్టా కోరిక నెర‌వేతుందా?

November 5, 2018 at 10:31 am

బుట్టా రేణుక‌. క‌ర్నూలు ఎంపీగా సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన మ‌హిళా నాయ‌కురాలు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ పై విజ‌యం సాధించిన ఆమె అనూహ్యంగా జ‌గ‌న్‌తో విభేదించి టీడీపీ పంచ‌న చేరింది. అయితే, పార్ల‌మెంటు నియ‌మ‌నిబంధ‌న‌ల మేర‌కు కండువా క‌ప్పుకోక‌పోయినా.. టీడీపీ నేత‌గానే చ‌లామ‌ణి అవుతున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మిగ‌నూరు అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన ఆమె.. జ‌గ‌న్ ఇవ్వ‌న‌న‌డంతోనే పార్టీ కి గుడ్‌బై చెప్పార‌ని అప్ప‌ట్లో స‌మాచారం హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఆ టికెట్‌ను ఇస్తాన‌ని చెప్ప‌డంతో వ్యూహాత్మ‌కంగా పార్టీ మారిపోయారు. అయితే, మ‌ళ్లీ కొన్నాళ్ల‌కు ఎమ్మిగ‌నూరులో పోటీ ఎక్కువ‌గా ఉంద‌ని, టికెట్ క‌ష్ట‌మ‌ని బాబు బుజ్జ‌గించారు. దీంతో పెద్దాయ‌న మాట కాద‌నేలేక ఎంపీ సీటుకే తిరిగి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇక్క‌డరాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు చాలా వేగంగా మారిపోయాయి.11836689_441892529331300_1262531254307253562_n

కాంగ్రెస్‌తో టీడీపీ అదినేత చంద్ర‌బాబు పొత్తు పెట్టుకున్నారు. అయితే, ఇది జాతీయ స్తాయి వ‌ర‌కే ప‌రిమితం అవుతుందా? లేక ఏపీలోనూ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా? అనేది ప్ర‌శ్న‌. స్థానిక కాంగ్రెస్ నేత‌లు చెప్ప‌డం ఏంటంటే.. త‌మ‌కు ఇప్పుడు ఏపీలో కోలుకోవాలంటే.. బ‌ల‌మైన టీడీపీ వంటి పార్టీ అండ అవ‌స‌ర‌మ‌ని, త‌మ అధినేత రాహుల్ ఈ ఉద్దేశంతోనే బాబుతో జ‌ట్టుకు అంగీక‌రించార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాము కూడా రాబోయే రోజుల్లో బాబుతో కలిసి ప్ర‌యాణం చేస్తామ‌ని అంటున్నారు. ఇదే వాస్త‌వం అయితే, ఏపీలోని కొన్ని స్థానాల‌ను టీడీపీ త‌ప్ప‌కుండా కాంగ్రెస్‌కు కేటాయించాల్సి రావొచ్చు. అంటే 2014లో బీజేపీకి ఎలా కేటాయించిందో అదేవిదంగా ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా చంద్ర‌బాబు టికెట్లు కేటాయించే ప‌రిస్థితి ఉంటుంది. దీనిని బ‌ట్టి క‌ర్నూలు ఎంపీ సీటుపై ఎప్ప‌టి నుంచో ఆశ‌లు పెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్ర కాష్‌రెడ్డికి టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉంది.27972540_832104606976755_4627413758093135239_n

ఇది జ‌రిగితే.. సాంకేతికంగా బుట్టా ఇక‌, క‌ర్నూలు టికెట్‌ను వ‌దులుకోవాల్సి ఉంటుంది. అయితే, అదేస‌మ‌యంలో బుట్టా రేణుక క‌ల‌లు కంటున్న ఎమ్మిగ‌నూరు అసెంబ్లీల టికెట్‌ను చంద్ర‌బాబు ఇస్తారా? అనేది కూడా సందేహంగానే క‌నిపిస్తోంది. ఇక్క‌డ పార్టీని అభివృద్ధి చేసి.. గెలుపు గుర్రం ఎక్కించిన ఎమ్మెల్యే జయ‌నాగేశ్వ‌ర‌రెడ్డి బ‌లంగా ఉన్నారు. క్షేత్ర‌స్థాయిలో పార్టీని ఇక్క‌డ అభివృద్ధి చేశారు. వ‌చ్చే ఎన్నికల్లోనూ ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని చూస్తున్నారు. మ‌రి అలాంటి నాయ‌కుడిని ప‌క్క‌న పెట్టి వైసీపీ నుంచి వ‌చ్చిన బుట్టాకు టికెట్ ఇస్తే.. జ‌య‌నాగేశ్వ‌ర‌రెడ్డి ప‌రిస్థితి ఏంటి? కేడ‌ర్ బుట్టా వెనుక వెళ్తుందా? అనేది సందేహంగా మారింది. 1989 నుంచి వ‌రుస విజ‌యాల‌తో ఇక్క‌డ టీడీపీ దూసుకు పోయింది. ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన బీవీ మోహ‌న్‌రెడ్డి హ్యాట్రిక్ కొట్టారు.

అయితే, 2004, 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైఎస్ హ‌వా బాగా న‌డిచింంది. దీంతో పార్టీ కేడ‌ర్ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయింది. అలాంటి దానిని చ‌క్క‌దిద్ది తిరిగి ఇక్క‌డ టీడీపీ గెలిచేలా నాగేశ్వ‌ర‌రెడ్డి కృషి చేశారు. మ‌రి ఇప్పుడు ఈయ‌న‌ను తొల‌గించి బుట్టాకు అవ‌కాశం ఇస్తే వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని అంటున్నారు ఇక్క‌డ సీనియ‌ర్లు. ఈ క్ర‌మంలో బుట్టా ప‌రిస్థితి అటు పార్ల‌మెంటుకా? ఇటు అసెంబ్లీకా? అనేది సందేహంగా మారింది. పోనీ.. ఇది కాద‌ని వేరే చోట నుంచి అవ‌కాశం ఇవ్వ‌డానికి కూడా క‌ర్నూలు మొత్తంగా టికెట్ల కోసం ఎదురు చూస్తున్న త‌మ్ముళ్లు చాలానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో బుట్టా భ‌విత‌వ్యం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది.

బాబు నిర్ణ‌యంతో బుట్టా కోరిక నెర‌వేతుందా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share