ఆ మంత్రి, ఆ ఎమ్మెల్యేపై బాబు నిఘా..!

ఎన్నిక‌లు, క‌ప్ప‌దాట్లు, జంపింగ్ జ‌పాంగ్‌లు ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో కామ‌న్ అయిపోయాయి. ఈ మూడేళ్ల‌లో విప‌క్ష పార్టీల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఏపీలో అధికార టీడీపీ, తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెండేళ్లు కూడా టైం లేదు. అయితే వీరంతా ఇప్పుడు ఉన్న అధికార పార్టీల్లోనే ఉంటారా ? అంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో పార్టీలోకి కూడా జంప్ చేసేందుకు త‌మ ప్ర‌య‌త్నాల్లో తాము ఉన్నార‌ట‌. ఇక ఏపీలో జ‌న‌సేన ఎంట్రీతో రాజ‌కీయం రంజుగా మారుతోన్న వేళ అధికార టీడీపీలో ఉన్న వాళ్లే ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నార‌న్న వార్త‌లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే త‌మ పార్టీలోనే ఉంటూ వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్న వారిపై సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక నిఘా పెట్టిన‌ట్టు టీడీపీ ఇన్న‌ర్ సైడ్ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న కేబినెట్‌లో ఓ మంత్రితో పాటు మ‌రో ఎమ్మెల్యేపై నిఘా పెట్టిన‌ట్టు స‌మాచారం. ఆ ఇద్ద‌రు ఎవ‌రో కాదు మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఒక‌రు అయితే, మ‌రొక‌రు ఇటీవ‌ల చంద్ర‌బాబు, అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మ‌రొక‌రు.

వీరిద్ద‌రు ఎప్పుడు ఏం చేస్తున్నా స‌రే చంద్ర‌బాబు ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు, వేగుల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. గంటాతో పాటు ఆయ‌న బ్యాచ్ ఎమ్మెల్యేలు ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి గంప‌గుత్త‌గా టీడీపీలోకి వ‌చ్చేశారు. ఇప్పుడు ఇక్క‌డ స‌రైన ప్ర‌యారిటీ లేక‌పోవ‌డంతో ఆ గ్యాంగ్ మొత్తం జ‌న‌సేన‌లోకి వెళుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ పాల‌న బాగుందంటూ వ‌స్తోన్న స‌ర్వేల‌తో వారు కాస్త డైల‌మాలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఒక వేళ ఎన్నిక‌ల టైంకు జ‌న‌సేన పొజిష‌న్ ఏ మాత్రం బాగున్నా వీరు అటు దూకేసినా దూకేయొచ్చు.

ఇక బొండా ఉమా జ‌న‌సేన‌లోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం ఆరు నెల‌లుగా జ‌రుగుతోంది. మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో ఆయ‌న చంద్రబాబునే ధిక్క‌రించేలా మాట్లాడారు. చంద్ర‌బాబు కాపుల గొంతు కోశారంటూ చేసిన వ్యాఖ్య‌లు బాబుకు తీవ్ర ఆగ్ర‌హం క‌లిగించాయి. ఇక అటు గంటా, ఇటు బొండా వార‌సులు ఇద్ద‌రూ ప‌వ‌న్‌కు వీరాభిమానులు. ప‌వ‌న్ సినిమాల రిలీజ్ టైంలో వీరి హంగామా మామూలుగా ఉండ‌దు. జ‌న‌సేన‌కు వీరు ఇన్న‌ర్‌గా స‌పోర్ట్ చేస్తున్నార‌న్న మ్యాట‌ర్ కూడా బాబు వ‌ద్ద‌కు వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలోనే వీరిపై బాబు స్పెష‌ల్ నిఘా పెట్టిన‌ట్టు టాక్‌. అయితే బాబుపై త‌మ‌పై నిఘా పెట్టిన మ్యాట‌ర్ ఆ ఇద్ద‌రు నేత‌లకు కూడా తెలిసింద‌ట‌.