ఎన్నిక‌ల ముంగిట బాబుగారి చిత్రాలు..!

November 10, 2018 at 3:50 pm

సందు చూసి మందు వేయ‌డం.. అందిన కాడికి దండుకోవ‌డం.. అధికారం కోసం అడ్డ‌దారులు తొక్క‌డం.. టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తెలిసినంత‌గా మ‌రెవ్వ‌రికీ తెలియ‌దంటే అతిశ‌యోక్తిక కాదేమో.. ఎందుకంటే.. దేశంలోనే సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌గా త‌న‌కు తాను స‌ర్టిఫికెట్ ఇచ్చుకుంటారు కాబ‌ట్టి. ఇక ఎన్నిక‌ల ముంగిట బాబుగారి చిత్రాలు మామూలుగా ఉండ‌వు. అప్పుడెప్పుడో ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఖాలీ అయిన రెండు మంత్రి ప‌ద‌వుల‌ను ఇప్పుడు భ‌ర్తీ చేస్తున్నారు. ఎన్నిక‌ల ముంగిట మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు బాబు పూనుకోవ‌డం గ‌మ‌నార్హం. అది కూడా ప్ర‌భుత్వం ఏర్ప‌డి నాలుగేళ్లు దాటిపోయి.. మ‌రికొన్ని నెల‌ల్లో ఎన్నిక‌లు రానున్న వేళ‌.. మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ‌కు పూనుకోవ‌డంపై ప‌లువురు నాయ‌కులు సెటైర్లు వేస్తున్నారు.sravan23

ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక‌లో ఆదివారం ఉద‌య‌మే ఈ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌నుంది. ఇక ఎవ‌రా ఇద్ద‌రు కొత్త మంత్రులు అంటే.. ఒక‌రేమో.. మైనార్టీనేత, ప్రస్తుత శాసన మండలి చైర్మన్ ఎండీ ఫరూక్. ఈయ‌న‌కు మైనార్టీ సంక్షేమంతో పాటు మరికొన్ని అదనపు శాఖలు అప్పగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రొక‌రు మావోయిస్టుల దాడిలో మ‌`తి చెందిన‌ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కొడుకు శ్రావణ్ కుమార్. గిరిజన సంక్షేమశాఖను అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఫరూక్ టీడీపీ ఆవిర్భావానికంటే ముందే రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో తొలిసారిగా టీడీపీ టికెట్ పై నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాతి కాలంలో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఆయ‌న‌ మైనార్టీ కోటాలో మంత్రిపదవి దక్కించుకుంటున్నారు.ap-ministry

తండ్రి మ‌ర‌ణంతో శ్రావణ్ కుమార్ అనుకోకుండా మంత్రి అవుతున్నారు. అయితే.. ఇక్కడ ఓ విష‌యాన్ని ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ తరపున అరకు ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి సర్వేశ్వరరావు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తరపున ఇప్పుడు ఆయన కొడుక్కి మంత్రిపదవి లభించింది. పార్టీలో మొద‌టి నుంచీ క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న వారిని ప‌క్క‌న‌బెట్టి ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారిని ప్రోత్స‌హించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. సొంత పార్టీ నేత‌లే లోలోప‌ల మండిప‌డుతున్నారు. మ‌రోవైపు ఎన్డీయేలో కొన‌సాగినంత‌కాలం.. మైనార్టీ వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు చంద్ర‌బాబు. దాని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. అది కూడా ఎన్నిక‌ల ముంగిట ఆవ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం స్వార్థ‌ప్ర‌యేజ‌న‌మేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

ఎన్నిక‌ల ముంగిట బాబుగారి చిత్రాలు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share