మ‌రి.. ఆ కుట్ర‌లేమిటో చెప్ప‌రాదా బాబూ..!

September 20, 2018 at 3:21 pm

వెన‌క‌టికి ఏదో సామెత చెప్పిన‌ట్టు.. చంద్ర‌బాబు త‌న‌పైనా, త‌న ప్ర‌భుత్వంపైనా కేంద్రంలోని బీజేపీ పెద్ద కుట్ర ప‌న్నింద ని, ఆ కుట్ర‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ లు స‌హ‌క‌రిస్తున్నార‌ని అందుకే వారు ఇప్పుడు ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని మ‌రిచిపోయార‌ని టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. అయితే, వీరు చేస్తున్న కుట్ర‌లు ఏమిటో ఆయ‌న బ‌య‌ట పెట్ట‌డం లేదు. ఏపీ ప్రయోజనాలను నెరవేర్చకుండా, టీడీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని చంద్ర‌బాబు ఆరోపించారు. ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన తర్వాత తమపై ద్వేషం పెంచుకుని దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు.naidu1-U20573096666TIB--621x414@LiveMint

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తొలుత టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా సంఘీభావం తెలిపిందని… తాము ఎన్డీయేతో విభేధించాక మనసు మార్చుకుందని తెలిపారు. దీనికి బీజేపీయే కారణమని పరోక్షంగా చెప్పారు. న్యాయమైన డిమాండ్లు తీర్చమంటే ద్వేషాన్ని పెంచి పంచుతున్నారని విమర్శించారు. అయితే, చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టు.. ఆ ద్వేషాలు ఏమిటో.. ఆ కుట్ర‌లు ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. ప్ర‌త్యేక హోదా ఎందుకు ఇవ్వ‌రు ? అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. దీనిని తొలుత ఇవ్వ‌లేమ‌ని బీజేపీ ప్ర‌భుత్వం చెప్పిన‌ప్పుడు.. ఊ.. కొట్టింది బాబే.. దీంతోనే కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీకి సై అంది. కానీ, ఇప్పుడు మ‌ళ్లీ.. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డం కుట్ర‌లో భాగ‌మేన‌ని ప్ర‌చారం చేస్తున్నారు చంద్ర‌బాబు.

అయినా.. ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు ఎంత‌? దానికి ల‌భిస్తున్న స్థానాలు ఎన్ని? వ‌ంటివాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ప్పుడు చంద్ర‌బాబుపై కుట్ర‌లు చేయాల్సిన అవ‌స‌రం బీజేపీకి ఎందుకు ఉంటుంది? ఇక‌, కేసీఆర్‌తో క‌లిసి ముందుకు వెళ్ల‌డానికి కూడా బీజేపీ మోకాల‌డ్డింద‌ని చెప్ప‌డం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లింది. టీఆర్ ఎస్ వ్యూహాత్మ‌కంగానే బాబును దూరంగా పెట్టింది? అయినా ఏ మొహం పెట్టుకుని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చంద్ర బాబుతో జ‌ట్టుక‌డ‌తారు? ఓటు కు నోటు కేసులో .. “చంద్ర‌బాబూ నువ్వొక దొంగ‌!!“ – అని బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. బాబుతో ఎలా జ‌త‌క‌డ‌తారు? ఇక‌, తెలంగాణ ద్రోహుల పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీనేన‌ని జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల స‌మయంలో టీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌చారం చేశారు
మ‌రి అలాంటి పార్టీతో ఎలా జ‌ట్టుక‌డ‌తారు? కానీ, రాష్ట్రంలో కీల‌క స‌మ‌యంలో స‌మ‌స్య‌లు వెలుగు చూస్తున్న స‌మ‌యంలో వాటిని త‌ప్పించేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఇలాంటి లేనిపోని ప్ర‌క‌ట‌న‌ల‌ను తెర‌మీదికి తెచ్చి ప‌బ్బం గ‌డుపుతున్నార‌నే వాద‌న పెరుగుతోంది. వాస్త‌వానికి కుట్ర‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంటే. ఆ కుట్ర‌ల‌ను ఎదుర్కొనే స‌మ‌ర్ధ‌త చంద్ర‌బాబుకు ఉండాలి. కానీ, ఇలా వేదికెక్కిన ప్ర‌తిచోటా…తానేదో అమాయ‌కుడిన‌ని, త‌న‌ను ఇలా చేస్తున్నార‌ని చెప్పుకోవ‌డం ఆయ‌న‌కు త‌ల‌వంపులు అంటున్నారు విశ్లేష‌కులు.

మ‌రి.. ఆ కుట్ర‌లేమిటో చెప్ప‌రాదా బాబూ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share