బాబు పాల‌నపై.. ప్ర‌జ‌ల టాక్ ఇదే

October 8, 2018 at 12:29 pm

కొన్ని నిజాలు పాల‌కుల‌కు ఇబ్బంది పెడ‌తాయి! ముఖ్యంగా అంతా బాగుంద‌ని, ప్ర‌జ‌ల్లో సంతృప్తి సూప‌ర‌ని ప‌దే పదే ప్ర‌క టించుకునే ఏపీ సీఎం చంద్ర‌బాబు వంటి వారు ఇలాంటి నిజాల‌ను అస్స‌లు జీర్ణించుకునే ప‌రిస్థితి ఉండ‌దు. స‌రే! అ స‌లు విష‌యంలోకి వస్తే.. రాష్ట్రంలో ప్ర‌జ‌లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని, ఇది 85% ఉంద‌ని ఆయ‌న వేస్తున్న లెక్క‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. దీనిని మ‌రింత పెంచాల‌ని బాబు సంబంధిత అధికారుల‌ను సైతం ఆదేశిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్తితి మాత్రం దీనికి భిన్నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఎక్క‌డిక‌క్క‌డ చంద్ర‌బాబు పాల‌న అవినీతి మ‌యంగా క‌నిపిస్తోంద‌ని ఏ ప్ర‌భుత్వ కార్యాల‌యానికి వెళ్లినా.. అక్క‌డ‌కు వ‌స్తు న్న ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్న మాట‌. ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డంతో టార్గెట్లు పెట్టుకుని మ‌రీ అధికారులు వ‌సూలు చేస్తు న్నార‌ని అంటున్నారు. ఈ విష‌యంలో రెవెన్యూ శాఖ నాలుగు అడుగులు ముందుకు వేసింద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. వీఆర్‌వో నుంచి ఎంఆర్‌వో వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ చేతులు త‌డ‌పందే ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. అదేస‌మ యంలో వైద్య శాల‌ల్లోనూ పేద‌ల ర‌క్తం పీడిస్తున్నార‌ని ప్ర‌భుత్వ అనుకూల మీడియాల్లోనే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పిల్ల పుట్టిన ద‌గ్గ‌ర నుంచి మృత‌దేహానికి పోస్టు మార్టం వ‌ర‌కు కూడా అన్ని విధాలా వైద్యులు రోగుల‌ను పిండి పిప్పిచేస్తున్నారు.

ఇక‌, విద్యాల‌యాలు చెప్పుకొనేందుకు మాత్ర‌మే ఉన్నాయి త‌ప్పితే.. ఇంక ఎలాంటి ప్ర‌యోజ‌నాల‌ను చూపించ‌లేక‌పోతు న్నాయి. రియ‌ల్ ఎస్టేట్ పేరుతో సాగుతున్న దందాల‌కు లెక్కేలేదు. ఉచిత ఇసుక అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు కాసుల పంట పండిస్తోంది. అవినీతి ర‌హిత ఆంద్ర‌ప్ర‌దేశ్‌ను త‌యారు చేయాల‌ని భావించిన చంద్ర‌బాబు అవినీతిమ‌య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను త‌యారు చేస్తున్నారన‌డంలో సందేహం లేద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లే ఈ ప్ర‌భుత్వంపై 85% అసంతృప్తిని వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల వేళ ప్రభుత్వంపై ఇంత‌లా వ్య‌తిరేక‌త వ‌స్తుంటే.. ప్ర‌భుత్వాధినేత మాత్రం త‌మ‌పై సంతృప్తి ఉంద‌ని చెబుతుండ‌డం ఏమేర‌కు స‌మంజ‌స‌మో.. ఆయ‌న‌కే తెలియాలి. ఈ విష‌యంలో మంత్రులు కూడా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారేకావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చంద్ర‌బాబు కాయ‌క‌ల్ప చికిత్స చేసి ప్ర‌భుత్వాన్ని కాపాడుకుంటారో లేదో చూడాలి.

బాబు పాల‌నపై.. ప్ర‌జ‌ల టాక్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share