బాబ్లీపై బాబు యూట‌ర్న్ ఎందుకంటే..?

September 19, 2018 at 6:01 pm

నిన్న మొన్న‌టి వ‌ర‌కు భీష‌ణ ప్ర‌సంగాలు, వ్యాఖ్య‌ల‌తో అద‌ర‌గొట్టిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అన‌నూహ్యంగా బాబ్లీ ప్రాజెక్టు వివాదంలో మ‌హారాష్ట్ర కోర్టు ఇచ్చిన నాన్ బెయిల‌బుట్ వారెంట్‌పై యూట‌ర్న్ తీసుకున్నారు. వాస్త‌వానికి రెండు రోజుల కిందటి వ‌ర‌కు కూడా బాబ్లీపై వ‌చ్చిన నోటీసుల‌కు తానే స్పందిస్తాన‌ని, కోర్టుకు హాజ‌ర‌వుతాన‌ని కూడా చంద్ర‌బాబు అన్నారు. తెలుగు వారి కోసం, వారి సంక్షేమం కోసం తాను క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చాటి చెప్పారు. అయితే, ఇంత‌లోనే బాబు వ్యూహం మారిపోయింది. బాబ్లీ కేసు విషయంలో ధర్మాబాద్ కోర్టుకు ఈ నెల 21న లాయర్‌ను పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. naidu

చార్జ్‌షీట్‌, నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌, కేసుకు సంబంధించిన ఇతర పత్రాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయంపై నిన్న ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో నాందేడ్‌ ఎస్పీ ఫోన్‌‌లో సంభాషించారు. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్‌ వారెంట్ ఉందని లేఖ పంపుతున్నామని, లేఖతో పాటు వారెంట్ కూడా పంపుతున్నామని నాందేడ్‌ ఎస్పీ సమాచారం అందించారు. అయితే తమకు లేఖ మాత్రమే అందిందని, నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ పంపలేదని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు తిరిగి నాందేడ్ ఎస్పీకి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. కేసు పత్రాలు లేకుండా ఎలా వెళ్తామని నాందేడ్ ఎస్పీని ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.IN16_NAIDU

అయితే, వారెంటును కూడా ఫ్యాక్స్ రూపంలో పంపిన‌ట్టు తెలిసింది. ఇక‌, చంద్ర‌బాబు వెళ్ల‌డ‌మే త‌రువాయి. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది? ఇవ‌న్నీ కూడా సాధారణంగా తెర‌మీదికి వ‌చ్చే ప్ర‌శ్నలే. అయితే, అనూహ్యంగా ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోవ‌డంలో బాబు వ్యూహం ఏంటి? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశం. ఒక‌వేళ స్వ‌యంగా చంద్ర‌బాబే కోర్టుకు వెళ్తే.. ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా? అనే సందేహం కూడా తెర‌మీదికి వ‌స్తోంది. మ‌రి ఇది కాకుండా ఏం జ‌రగ‌నుంది.?ఎందుకు బాబు ఇంత‌లోనూ దీనిపై యూట‌ర్న్ తీసుకున్నారు? అనే ప్ర‌శ్న‌ల‌కు త్వ‌ర‌లోనే స‌మాధానం వ‌స్తుందేమో చూడాలి. ఏదేమైనా.. బాబ్లీ వివాదంపై బాబు యూట‌ర్న్ తీసుకున్నారు.

బాబ్లీపై బాబు యూట‌ర్న్ ఎందుకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share