కేసీఆర్ వ్యూహం.. మ‌ళ్లీ చిక్కుల్లో బాబు..!

September 5, 2018 at 10:13 am

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే వార్తలు.. ఏపీలోని అధికార పార్టీ అధినేత చంద్రబాబుకు గుబులు పుట్టిస్తోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణాలో పార్టీని అభివృద్ధి చేయాలని ఎప్పటి నుంచో అక్కడి టీడీపీ తమ్ముళ్లు చంద్రబాబును కోరుతున్నారు. అయితే, దీనిపై ఆయన ఇప్పటి వరకు ఎలాంటి చారిత్రక నిర్ణయమూ తీసుకోలేదు. వెళ్లిన వారు వెళ్లిపోతున్నా.. చంద్రబాబు చూస్తూ కూర్చున్నారే తప్ప పార్టీని తెలంగాణలో డెవలప్ చేయాలని ఎక్కడా వ్యూహాత్మకంగా పావులు కదిపిన పాపాన పోలేదు. దీంతో ఇప్పటికే చాలా మంది కీలక నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే, ఇప్పుడు తెలంగాణలో ముందస్తు గాలి వీస్తోంది. దీనిపై స్పష్టమైన నిర్ణయం ఏదీ వెలువడక పోయినా.. సీఎం కేసీఆర్ త్వరలోనే అంటే దాదాపు ఈ నెల ఆఖరులోనే ముందస్తుకు సంబంధించి కీలక నిర్ణయాన్ని వెలువరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.38821387_685130875175163_6305539412511948800_n

ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణాలో టీడీపీని ఎలా ముందుకు నడిపించాలనే విషయంపై చంద్రబాబును తెలంగాణ నాయకులు ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నారు. దీంతో ఆయన త్వరలోనే తెలంగాణ విషయాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే.. కేసీఆర్ ఊరుకుంటారా? అనేది ప్రధాన సందేహంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు కేసీఆర్కు ఇజ్జత్ కా సవాల్గా మారుతున్నాయి. ఎలాగైనా సరే మళ్లీ గెలిచి తీరాలని ఉద్యమ నాయకుడు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సాధ్యమైనంత వరకు శత్రు శేషాన్ని తగ్గించుకునేందుకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి ఈ సమయంలో చంద్రబాబు వంటి వారు తెలంగాణలో ప్రవేశించి.. కాంగ్రెస్తో జట్టుకట్టి.. తనపై యుద్ధానికి కాలుదువ్వితే.. కేసీఆర్ సహిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఈ క్రమంలోనే కేసీఆర్ మళ్లీ `ఓటుకు నోటు` కేసు దుమ్ముదులుపక మానరని అంటున్నారు. చంద్రబాబు వంటి అపర రాజకీయ చాణిక్యుడిని లైన్లో పెట్టుకోవాలంటే.. ఈ కేసు తప్ప కేసీఆర్కు మరో మార్గం లేదనేది మేధావుల మాట. ఇప్పటికే ఈ కేసును వినియోగించి పదేళ్లపాటు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్నా.. కూడా చంద్రబాబును విజయవాడకు తరిమేశారనేది తెలంగాణలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, చంద్రబాబు ఈ కేసుకు కూడా లొంగపోతే.. ఏం చేయాలి? ఈ విషయంపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. మాటల మాంత్రికుడు, మాస్ ఇమేజ్ ఫుల్లుగా ఉన్నకేసీఆర్.. బాబును లైన్లో పెట్టేందుకు కేసును బయటకి తీస్తే.. బాబు దీనిని లైట్ తీసుకుంటే.. కేసీఆర్ మరో వ్యూహంతో ముందుకు వెళ్తారని అంటున్నారు పరిశీలకులు.

ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు రాష్ట్ర ఏర్పాటుకు ఎలా ఇబ్బందులు సృష్టించాడు. ఎలా అడ్డుపడ్డాడు? రాష్ట్ర ద్రోహిగా చంద్రబాబు ఏం చేశాడు? వంటి కీలక విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి.. ఇలాంటి వాడితో జతకడుతున్న కాంగ్రెస్ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుందని గట్టిగానే ప్రచారం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముందస్తు విషయంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. ఇదిలావుంటే, తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో నేతలు పార్టీ వీడినా.. క్యాడర్ చెక్కు చెదరలేదన్నారు. మరి ఈ ధీమా నిజంగానే ఎన్నికల వరకు ఉంటుందా? తుస్సు మంటుందా? అన్నది చూడాలి. naidu1-U20573096666TIB--621x414@LiveMint

కేసీఆర్ వ్యూహం.. మ‌ళ్లీ చిక్కుల్లో బాబు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share