ఇక బాబు గూబ గుయ్‌మ‌న‌డం ఖాయ‌మే..!

November 9, 2018 at 12:39 pm
Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai. *** Local Caption *** Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai.

పాపం బాబు.. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. అధికారం కోసం అడ్డ‌దారులు తొక్క‌డంలో.. అభివ‌`ద్ధి పేరుతో అందిన‌కాడికి మెక్క‌డంలో ఆయ‌న‌ది అందెవేసిన చేయి. ఈ నాలుగేళ్ల‌లో ఏమీ చేయ‌లేక‌పోయిన బాబు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు. ఎన్డీయేతో బంధం తెంచుకుని.. ఇప్పుడు బ‌ద్ధ శ‌త్రువు కాంగ్రెస్‌తో కాలు క‌లుపుతున్నారు. ఈ చిత్రాన్ని చూసి తెలుగు ప్ర‌జ‌లు తిట్టిపోస్తున్నా.. న‌వ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న‌రీతిలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఏపీలో అధికారంలోకి రావ‌డం.. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను, కేంద్రంలో బీజేపీని ఓడ‌గొట్ట‌డానికి ఎత్తులు వేస్తున్నారు. కానీ.. ఎన్ని చేసినా ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.Kodandaram-To-Join-TDPMahak

ఇండియా టుడే సంస్థ వెల్ల‌డించిన స‌ర్వే ఫ‌లితాల‌తో బాబు గూబ గుయ్‌మ‌న‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని 44% మంది ప్ర‌జ‌లు కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. త‌మ‌కు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు. ఎవ‌రు ముఖ్య‌మంత్రి కావాల‌న్న అంశానికి.. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌కు 46%, టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 25%, బీజేపీ నేత‌ కిషన్‌రెడ్డికి 16%, టీజేఎస్ అధినేత‌ కోదండరాంకు 7%, ఎంఐఎం నేత‌ అసదుద్దీన్‌ ఒవైసీకి 4% మద్దతు పలికారు.chandra-babu

తెలంగాణ‌లోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మందిని టెలిఫోన్ లో సంప్రదించి ఇండియా టుడే సంస్థ ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌’ పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. అయితే.. కాంగ్రెస్‌– టీడీపీ పొత్తు వారికి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చున‌ని స‌ర్వేలో తేలింది. ఈ ఫ‌లితాల‌తో మ‌హాకూట‌మి నేత‌లు కంగుతింటున్నారు. కాంగ్రెస్ నేత‌`త్వంలో మ‌హాకూట‌మి ఇంకా సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో క్లారిటీకి రాలేక‌పోతోంది. ఐదు వారాలుగా సీట్లపై సంప్ర‌దింపులు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు కూడా వీళ్ల వ్య‌వ‌హారం చూసి న‌వ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు కుదురుకోక‌ముందే దెబ్బ‌కొట్టాల‌న్న వ్యూహంతో ముందుకు వ‌చ్చిన కేసీఆర్ స‌క్సెస్ అవ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.KCR_MEET1234

అయితే.. తెలంగాణ‌లో మ‌హాకూట‌మి ఓడిపోతే.. ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్‌తో బాబు క‌ల‌వ‌డంపై ఆంధ్రులు భ‌గ్గుమంటున్నారు. రాష్ట్రాన్ని అడ్డ‌దిడ్డంగా విడ‌గొట్టిన కాంగ్రెస్‌తో బాబు చేతులు క‌ల‌ప‌డాన్ని అక్క‌డి ప్ర‌జ‌లు అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక ప‌రిణామాల‌న్నీ కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయ‌ని, ఏపీలో వార్ వ‌న్‌సైడే ఉంటుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అధికారం కోసం అడ్డ‌దారులు తొక్కే బాబుకు ఈ సారి ప్ర‌జ‌లు గ‌ట్టి బుద్ధి చెబుతార‌ని, గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే టీడీపీకి ప‌డుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.

ఇక బాబు గూబ గుయ్‌మ‌న‌డం ఖాయ‌మే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share