మీడియాపై బాబు పలుకులు విన్నారా

September 21, 2018 at 9:31 am

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మీడియా గురించి, రెండు అదికార పార్టీల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో మీడియా అత్య‌తం పార‌ద‌ర్శకంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కోర‌కుండానే కితాబు ఇచ్చారు. అదేస‌మ‌యంలో తెలంగాణాలో మాత్రం మీడియా అధికార పార్టీకి భ‌య‌ప‌డిపోయి.. ప‌నులు చేయ‌క‌పోయినా.. చేసిన‌ట్టు.. అభివృద్ది జ‌ర‌గ‌క‌పోయినా.. జ‌రిగిన‌ట్టు చూపించింద‌ని, దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఎన్నిక‌ల‌పై ప‌డింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామం ప్ర‌జాస్వామ్యానికి చేట‌ని కూడా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ‘‘తెలంగాణలో అధికార పక్షానికి అంతా బాగుందని మీడియాలో చూసేవాళ్లం. కానీ, అసెంబ్లీ రద్దు తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్తే నిలదీతలు ఎదురవుతున్నాయి“ అన్నారు చంద్ర‌బాబు.42189043_2284826328197612_1725745025200947200_n

“ఇక్కడ ఏపీలో ఏం జరుగుతున్నా ఎలాంటి గుట్టు మ‌ట్టు లేకుండా మీడియా రాస్తోంది.. చూపిస్తోంది. దీనివల్ల లోపం ఉంటే దిద్దుకోగలుగుతున్నాం. తెలంగాణలో పరిస్థితిని తెచ్చుకోకూడదనుకొంటే మరింతగా ప్రజల్లో ఉండండి. ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే కనిపిస్తున్నారని… అంతకుముందు అందుబాటులో లేరని అనిపించుకోవద్దు’’ అని త‌న టీడీపీ ఎమ్మెల్యేల‌కు ఆయ‌న బోధించారు. ఇక్క‌డే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్లోని అంత‌రార్ధంపై మేధావులు విశ్లేష‌ణ చేస్తున్నారు. ఏపీలో మీడియా పార‌ద‌ర్శ‌కంగా ఉంద‌ని బాబు చెప్ప‌డం క‌న్నా.. క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్ట‌డం వంటి ఘ‌ట‌న మ‌రొక‌టి లేద‌ని అంటున్నారు. ఏపీలో నిజంగానే మీడియా నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఏ ఎమ్మెల్యే ఎంత తింటున్నాడో? ఇసుక మాఫియాకు అడ్డా ఎక్క‌డుందో? అవినీతి ఎందుకు పెరుగుతోందో? వ‌ంటివి నిఖార్సుగా బ‌య‌ట ప‌డేవేన‌ని అంటున్నారు.

అయితే, అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో మీడియాను స‌మ‌ర్ధిస్తున్న‌ట్టు కాద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అక్క‌డ ఉండే స‌మ‌స్య‌లు, ఇబ్బందులు అక్క‌డ కూడా ఉన్నాయ‌ని, అయినా కూడా మీడియా వాటిని వెలుగులోకి తేకుండా కేవ‌లం భ‌జ న బృందంగా మారిపోయింద‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు. కానీ, త‌న విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా త‌ప్పుల‌న్నింటినీ.. మీడియాపై నెట్టేసేందుకు పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు. నిజానికి రాష్ట్రంలో పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్‌ను మార్చ‌డంలోనే వేల కోట్ల మేర‌కు అవినీతి జ‌రిగింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, ప్ర‌జా ఉద్య‌మాల‌కు ప‌లు ప‌త్రిక‌ల్లో చోటు కూడా ఉండ‌డం లేదు. కేవ‌లం చంద్ర‌బాబు భ‌జ‌న ప‌త్రిక‌లుగా మీడియా వ్య‌వ‌హ‌రిస్తోంది. రెండు రోజుల కింద‌ట విజ‌య‌వాడ‌లో మ‌హాగ‌ర్జ‌న పేరిట చంద్ర‌బాబు, మోడీల‌కు వ్య‌తిరేకంగా వామ‌ప‌క్షాలు క‌దం తొక్కితే.. జ‌నాలు నింగి వొంగిందా? నేల ఈనిందా? అనే త‌ర‌హాలో ఇసుకేస్తే రాల‌న‌ట్టుగా హాజ‌ర‌య్యారు. కానీ, ప్ర‌భుత్వ అనుకూల మీడియా ఒక్క‌ముక్క కూడా ప్ర‌సారం చేయ‌క‌పోవడం ఎలాంటి త‌ర‌హా జ‌ర్న‌లిజ‌మో బాబు చెప్పాలి!!

మీడియాపై బాబు పలుకులు విన్నారా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share