బాబుకు అఖిల కండీష‌న్.. తెలిస్తే షాకే

May 10, 2018 at 6:09 pm
Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai. *** Local Caption *** Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai.

ఎన్నిక‌లకు ఏడాది స‌మ‌యమే ఉండ‌టంతో వీలైనంత‌గా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని త‌గాదాలు, వివాదాలు ప‌రిష్క‌రించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో మొద‌ట వినిపించే పేరు ఆళ్ల‌గ‌డ్డ‌. దివంగ‌త భూమా నాగిరెడ్డి అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి భూమా అఖిల‌ప్రియ మ‌ధ్య మొద‌లైన వివాదం.. చినికి చినికి గాలివాన‌లా మారింది. ఎట్ట‌కేల‌కు వీరి మ‌ధ్య రాజీ కుదిర్చారు చంద్ర‌బాబు. అయితే ఇంత‌టితో ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టేన‌ని అంతా భావించారు. కానీ ఇది ఇంకా ర‌గులుతోంద‌నే విష‌యం మ‌రోసారి తేలిపోయింది. ఎంతో కాలం నుంచి పార్టీ కోసం ప‌నిచేస్తున్న ఏవీ సుబ్బారెడ్డికి ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యార‌ట‌. అయితే ఈ విష‌యం తెలిసిన మంత్రి హుటాహుటిన చేరుకుని.. సుబ్బారెడ్డికి ప‌ద‌వి ఇస్తే కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుందంటూ బాబుకు కండీష‌న్ పెట్టార‌ని తెలుస్తోంది. 

 

కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో చంద్ర‌బాబు మెత‌క‌వైఖ‌రి ఇప్పుడు ఆయ‌నకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పార్టీ నేతల మధ్య  ఉండే విభేదాలు.. పంచాయితీల్ని పరిష్కరించే విషయంలో ఆయ‌న చేస్తున్న చిన్న త‌ప్పులే ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతున్నాయి. మొక్క వంగ‌నిది మానై వంగునా అంటారు పెద్ద‌లు. ఇప్పుడు అఖిల‌ప్రియ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేర‌డం.. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో నాగిరెడ్డి కూతురు అఖిల‌ప్రియ‌, అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. ఈసెగ‌లు ఇంకా రగులుతూనే ఉన్నాయి. 

 

ఈ మధ్యన ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర సందర్భంగా రాళ్ల దాడి జరగటం.. దీనికి భూమా వర్గమే కారణమంటూ ఏవీ ఆరోపించటం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఇరు వర్గాల వారిని పిలిపించిన బాబు.. ఇద్దరికి క్లాస్ పీకినట్లుగా చెబుతారు. ప్ర‌స్తుతం ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలన్న ఆలోచనలో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. ఏవీకి కానీ నామినేటెడ్ పోస్ట్ ఇస్తే తాను కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని భూమా అఖిలప్రియ బాబుకు సంకేతాలు పంపినట్లుగా చెబుతున్నారు. ఈ పరిణామం పార్టీకి చెందిన పలువురు సీనియర్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధినేతకే ఆర్డర్లు వేసే స్థాయికి అఖిలప్రియ వెళ్లిందా? అంటూ కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే.. మరికొందరు బాబు ప్రయారిటీ ఇస్తున్న కొద్దీ ఆమె తీరు సరిగా లేదంటున్నారు.

 

ఒకవేళ తాను కోరిన దానికి భిన్నంగా బాబు వ్యవహరించిన పక్షంలో.. కీలక నిర్ణయం తీసుకోవాలన్న మాటను తన కేడర్ కు సమాచారాన్ని అందించటంతో పాటు.. అందుకు తగినట్లుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. భూమా మరణం నేపథ్యంలో వారి కుటుంబానికి అండగా ఉంటానన్న బాబు.. అఖిలకు మంత్రి పదవిని కట్టబెట్టారని.. కానీ ఆమె పని తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదన్న మాటను టీడీపీ నేతలు చెబుతున్నారు. దాచేపల్లి ఇష్యూలోనూ బాబు సర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మండిపడితే.. వారికి కౌంటర్ ఇచ్చేందుకు మహిళా మంత్రిగా అఖిలప్రియ స్పందించాల్సి ఉన్నా.. ఆ విషయం తనకేమీ పట్టలేదన్నట్లుగా వ్యవహరించారని మండిపడుతున్నారు. ఇప్ప‌టికైనా  అఖిలపై బాబు కీలక నిర్ణయం తీసుకుంటారా? లేక అఖిలే నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఆస‌క్తిక‌ర అంశం!

బాబుకు అఖిల కండీష‌న్.. తెలిస్తే షాకే
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share