చంద్ర‌బాబుకు కాంగ్రెస్ షాక్‌…

December 15, 2018 at 12:32 pm

ఎదురుదెబ్బ‌లే..ఎదురుదెబ్బ‌లు అన్న‌ట్లుగా మారింది..చంద్ర‌బాబుది.. ఏం చేసినా…ఎటు వైపు అడుగేసినా అన్ని బెడిసికొడుతున్న అంశాలే..
30 ఏళ్ల వైరాన్ని ప‌క్క‌న పెట్టి చంద్ర‌బాబు తెలంగాణ‌లో ప‌రోక్షంగా అధికారంలోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టారు. కాంగ్రెస్‌తో దోసి చేస్తే అటు ఏపీలోనూ ఎంతోకొంత క‌ల‌సి వ‌స్తుందిలే అనుకున్నారు…దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప‌వ‌నాలు వీస్తున్న వేళ‌..క‌లిసొస్తే కేంద్రంలోనూ చక్రం తిప్ప‌వ‌చ్చ‌ని అనుకున్నారు. ఇలా అనేక క‌ల‌లు గ‌న్న చంద్ర‌బాబుకు తెలంగాణ ఫ‌లితాల్లో ప్ర‌జ‌లు షాక్ ఇచ్చారు. ఇక చంద్ర‌బాబు వ‌చ్చి మా గెలిచే సీట్ల‌ను కూడా కారు ఖాతాలో ప‌డేలా చేశాడంటూ కాంగ్రెస్ నేత‌లు పుట్టి ముంచుతున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ కూడా చంద్ర‌బాబు వ‌ల్లే తెలంగాణ‌లో కాంగ్రెస్కు దుర్గ‌తి ప‌ట్టింద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నార‌ట‌.

ఇక కొత్త విష‌య‌మేమంటే ఆంధ్రాలో టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని ఆ పార్టీ నాయ‌కులు బ‌హిరంగ‌గానే చెబుతున్నారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తులపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి వివరణ ఇచ్చారు. పొత్తు కంటే విడిగా పోటీ చేస్తేనే ఇరు పార్టీలకు మేలు అన్న తరహాలో రఘువీరా వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక తాను వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకున్నా కళ్యాణ దుర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కళ్యాణ దుర్గం నుంచి టీడీపీ అధినేత పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో రఘువీరా ఈ మేరకు స్పందించారు.

చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడిప్పుడే ఏపీలో కోలుకుంటున్నాం…బీజేపీ వ్య‌తిరేక‌త ఎంతో కొంత క‌లిసి వ‌స్తుంది..టీడీపీ వైఫ‌ల్యాన్ని ప్ర‌జ‌ల‌కు చెబితే ఎంతో కొంత ఎన్నిక‌ల్లో లాభిస్తుంద‌ని వారు భావిస్తున్నార‌ని స‌మాచారం. ఇక తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత చంద్ర‌బాబుకు కాలు చెయ్యి ఆడ‌టంల లేదట‌. ఏపీలో అధికారంలోకి రావాలంటే ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్పా అది సాధ్యం కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇలా చంద్ర‌బాబుకు ఇటు తెలంగాణ‌లో షాక్ త‌గ‌ల‌గా..ఇప్పుడు ఏపీలోనే షాక్ ఖాయ‌మ‌ని తేలిపోతోంది…ఇక కాంగ్రెస్ చేయ్యి ఇస్తే సొంతంగా అధికారం చాలా క‌ష్ట‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో జ‌త క‌ట్టినా రాష్ట్రంలో ప్ర‌జ‌లు చంద్ర‌బాబు వైపు నిల‌వ‌డం కూడా క‌ల్లేన‌ని మ‌రికొంత‌మంది రాజ‌కీయ పండితులు తేల్చిచెబుతున్నారు.

చంద్ర‌బాబుకు కాంగ్రెస్ షాక్‌…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share