
రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎవరు ఎలాంటి పనులు చేసినా.. దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీయేనని చెబుతున్నా రు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. పిల్లి కూసినా.. కాకి మొరిగినా.. కూడా వాటికి మోడీ ట్రైనింగ్ ఇచ్చారని, అందు కే అవి అలా చేస్తున్నాయని, దీనివెనుక తనను రాజకీయంగా అంతం చేసే కుట్ర ఉందని చెప్పుకొనేందుకు ఆయన వెనుకాడడం లేదు. ఇక, వీటికి ఆపరేషన్ ద్రవిడ పేరుపెట్టిన పనిలేని ఓ నటుడు చేస్తున్న ప్రచారం మరింత కలరింగ్ పెంచేస్తోంది. వాస్తవానికి ఈ దేశంలో అన్ని అధికార వ్యవస్తలను వినియోగించుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చరిత్ర ఈ విషయాన్ని ఆధారాలతో సహా వెల్లడించింది. మరి అలాంటి పార్టీతోనే అంటకాగుతున్న చంద్రబాబు.. నెపాన్ని మాత్రం బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే, ఈ పన్ను సామాన్యులపై ఎంత భారంగా మారిందో పెద్ద పెద్ద వ్యాపారులకు అంత వరంగా మారిందనేది నిపుణుల మాట. ఈ క్రమంలోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు వారికి ఉన్న టార్గెట్లను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగారు. దే శవ్యాప్తంగా కూడా వారు ఈ ఏడాది టార్గెట్ను రీచ్ అయ్యేందుకు, బడా వ్యాపారుల ఆదాయపు పన్ను ఎగవేతకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపైనా కన్నేశారు. అయితే, సింపతీ రాజకీయాలకు, సెంటిమెంట్ రాజకీయాలకు చంద్రబాబు తెరదీశారు.
ఇక, చంద్రబాబు తాన అంటే.. తందాన అనేందుకు రెడీ అయిన రెండు పత్రికలు కొన్ని మీడియా సంస్థలు కూడా దీనిని రాజకీయం చేసేశాయి. ఐటీ దాడులు కేవలం చంద్రబాబుపై కక్ష సాధింపు ప్రక్రియలో భాగమేనని రాసుకొచ్చాయి. నిజానికి ఒక పక్క చంద్రబాబే.. రెండు రోజుల కిందట అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి… అక్రమార్కులను మోడీ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అన్యాయాలపై చూస్తూ ఊరుకున్నారని చెప్పారు. అదేసమయంలో జగన్ పేరు ఎత్తకుండా ఓ అక్రమార్కుడికి మోడీ అండగా నిలబడుతున్నారని అన్నారు. మరి ఇప్పుడు ఐటీ దాడులు చేసి. అక్రమార్కులపై కన్నెర్ర చేస్తుంటే.. మాత్రం తనపై చేస్తున్న దాడిగా సెంటిమెంట్ రాజకీయాలకు ఆయన తెరదీయడం ఆయనకే చెల్లిందనే వ్యాఖ్యలను బలపరుస్తున్నాయి. ఏదేమైనా.. రాజకీయ అపర చాణిక్యుడు కాబట్టి బాబు ఏం చెప్పినా ప్రజలు వినేసి.. ఆయనకే ఓట్లేసేయాలి కాబోలు!!