జ‌గ‌న్ పాద‌యాత్రను మించిన స‌ర్వే ఇంకోటుందా బాబూ..!

October 10, 2018 at 10:24 am

“మ‌న ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో సంతృప్తి స్థాయి 85% ఉంది. దీనిని 95 శాతానికి .. మ‌రి కొన్నాళ్ల‌కి 100 శాతానికి ప‌ట్టుకెళ్లాలి. ఇదే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి“ – అని ప‌దే ప‌దే చెప్పుకొచ్చే.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు అస‌లు సిస‌లు ప్ర‌జాభిప్రాయం ఎలా ఉంటుందో తెలియాలంటే.. జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు వ‌స్తే తెలుస్తుంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. నిజానికి అధి కారుల్లో చంద్ర‌బాబు అంటే.. ఓ విధ‌మైన గౌర‌వంతోపాటు భ‌యం కూడా ఉంది. దీంతో బాబును మెప్పించేందుకు వారు ఏవో ఏవో అంకెలు చూపించి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అంత సంతృప్తి ఉంది.. ఇంత సంతృప్తి ఉంది! అని పెద్ద ఎత్తున వారు లెక్క‌లు చెబుతున్నారు. చంద్ర‌బాబు వీటినే న‌మ్ముకుని నిజ‌మే క‌దా? అని అనుకుంటున్న ప‌రిస్థితి, ప్ర‌చారం చేస్తున్నారు కూడా!

అయితే, వాస్త‌వానికి ప్ర‌జ‌ల్లో ఎంత సంతృప్తి ఉంది? ప్ర‌భుత్వం గురించి ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పార్టీ ప‌రిస్థితి ఏంటి? ప‌్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న పలు సంక్షేమ ప‌థ‌కాల‌కు తోడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళ్తున్నారు? ప‌్ర‌జ‌ల్లో ఎలా తిరుగుతున్నారు? వారిపై ప్ర‌జ‌ల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? వ‌ంటి కీల‌క విష‌యాలు జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో స్ప‌ష్టంగా వెలుగు చూస్తున్నాయ‌ని చెబుతున్నారు. అన్ని వర్గాల ప్ర‌జ‌ల్లో ను తీవ్ర‌మైన అసంతృప్తి ఉంద‌ని నిరూపించేందుకు జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుండ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం, రాజ‌న్న రాజ్యం స్థాపించ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ ముందుకు సాగుతున్న ప‌రిస్థితి తెలిసిందే.43098173_1983308195022971_3701680884760444928_n

అప్ర‌తిహ‌తంగా సాగుతున్న ఈ పాద‌యాత్ర‌.. త్వ‌ర‌లోనే ముగింపు ద‌శ‌కు చేర‌నుంది. ఈ క్ర‌మంలో పాద‌యాత్ర‌లోనే జ‌గ‌న్‌ను క‌లుస్తున్న ప్ర‌జ‌లు వివిధ సామాజిక వ‌ర్గాల వారుత‌మ త‌మ స‌మస్య‌ల‌ను చెప్పుకొంటున్నారు. చేనేత కార్మికులు, గీత కార్మికులు, యాదవులు, కుమ్మరి, జాలరి, రజకులు, వడ్రంగులు, విశ్వబ్రాహ్మణులు, క్రిస్టియ‌న్లు ముస్లింలు కూడా త‌మ త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు. ఇక్క‌డ అత్యంత విచార‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకొంటున్న ఉచిత ఇసుక ప‌థ‌కంకానీ, విక‌లాంగుల‌కు, వృద్ధుల‌కు, వితంతువుల‌కు ఇస్తున్న పింఛ‌న్లు, ఎన్టీఆర్ హౌసింగ్ ప‌థ‌కం. వంటి కీల‌క విష‌యాల్లో తీవ్ర అవినీతి జ‌రుగుతోంద‌ని, ఆయా ప‌థ‌కాలు సైతం త‌మ‌కు చేరువ కావ‌డం లేద‌ని ప‌లువురు ఆరోపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆయా అభిప్రాయాల‌ను బ‌ట్టి.. ప్ర‌జ‌ల్లో సంతృప్తి స్థాయి 85 శాత‌మా? అసంతృప్తి స్థాయి 85 శాత‌మో చంద్ర‌బాబు గ్ర‌హించాల్సి ఉంది!!

జ‌గ‌న్ పాద‌యాత్రను మించిన స‌ర్వే ఇంకోటుందా బాబూ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share