తిట్టిన వారికే టికెట్లు.. బాబు స్టైలే డిఫ‌రెంట్‌..!

October 12, 2018 at 12:05 pm

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, మిత్రులు ఉండ‌ర‌ని అంటారు. ఇప్పుడు దీనిని నిజం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గ‌తాన్నిమ‌రిచిపోవాల‌నే సూత్రాన్ని ఆయ‌న తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీలో ఈ విష‌యంపై భారీ ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఇత‌ర పార్టీల్లో ఉండి.. ప‌ద‌వులు అనుభ‌వించి, చంద్ర‌బాబును దూషించిన వారు త‌ర్వాత విధిలేని ప‌రిస్థితిలో టీడీపీలో చేరారు. పోనీ.. ఇలా చేరాక అయినా టీడీపీ ప‌ట్ల విధేయ‌త చాటుకున్నారా? అధినేత చంద్ర‌బాబుకు విలువ ఇస్తున్నారా? అంటే ప్ర‌శ్నార్థ‌కంగానే మిగులుతున్నాయి. అయితే, ఇలాంటి వారిని ప‌క్క‌న పెట్టి ప‌నిష్మెంట్ ఇవ్వాల్సిన చంద్ర‌బాబు.. వారినే ఏరికోరి నెత్తిన ఎక్కించుకుంటున్నా ర‌ని పార్టీకే అంకిత‌మైన త‌మ్ముళ్లు తెర‌చాటుగా బాబుపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. శ్రీకాకుళం పాతపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 20వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన శత్రుచర్ల విజయరామరాజు విష‌యం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ అయింది. ఈయ‌న గ‌తంలో వైఎస్‌కు అనుంగు అనుచ‌రుడు. కాంగ్రెస్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రెండు సార్లు మంత్రిగా అంటే ప‌దేళ్లు అమాత్యునిగా చ‌క్రం తిప్పారు. అయితే, ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారి టీడీపీలోకి చేరారు. 2014లో అసెంబ్లీ సీటు సంపాయించి పోటీ చేసినా ఆయ‌న ఓడిపోయారు. దీంతో చంద్ర‌బాబు ఆయ‌నకు వెంట‌నే ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చారు. అయితే, ఇక్క‌డ విశేషం ఏంటంటే.. ఆయ‌న వైఎస్ అనుచ‌రుడిగాను, కాంగ్రెస్ నేత‌గాను, మంత్రిగాను ఉన్న స‌మ‌యంలో విపక్షంలో ఉన్న చంద్ర‌బాబును చాలానే టార్గెట్ చేశారు.123

ఆయ‌న నిత్యం విమ‌ర్శ‌లు గుప్పించారు. అయినా కూడా చంద్ర‌బాబు ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించి, టికెట్ ఇచ్చారు. ఓడిపోవ‌డంతో ఎమ్మెల్సీని చేశారు. మ‌రి ఇంత‌గా ఆద‌రించిన బాబు ప‌ట్ల శ‌తృచ‌ర్ల ఎలా ఉండాలి! ఎంత విధేయ‌త చూపించాలి! కానీ, ఇవేవీ ఆయ‌న చూపించ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప‌ట్టించుకోడు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప‌ట్టించుకోడు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న భార్య‌కు మాత్రం ఎమ్మెల్యే టికెట్ కోరుతున్నారు. ఇక‌, ఈయ‌న ఎస్టీ కాద‌ని ఇటీవ‌ల కోర్టు చెప్ప‌డంతో ఈయ‌న టికెట్‌ను ఈయ‌న భార్య‌కు ఇచ్చేందుకు చంద్ర‌బాబు సైతం ఓకే చెప్ప‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. ఇక‌, ఇలానే కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన పితాని స‌త్య‌నారాయ‌ణ‌కు కూడా చంద్ర‌బాబు వెంట‌నే టికెట్ ఇచ్చి.. మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. కానీ, ఈయ‌న కూడా పార్టీకి ఎలాంటి ప్ర‌యోజనం చేయ‌డం లేద‌ని, కిందిస్థాయి నాయ‌కుల‌ను, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌నుకూడా ప‌ట్టించుకోవ‌డం లేదేని అంటున్నారు. సో.. ఇదీ ఇప్పుడు టీడీపీలో ప‌రిస్థితి!!

తిట్టిన వారికే టికెట్లు.. బాబు స్టైలే డిఫ‌రెంట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share