ప‌ద్మ‌వ్యూహంలో చంద్ర‌బాబు.. మునుగుతారా… తేలుతారా..!

October 8, 2018 at 11:43 am

అపార రాజ‌కీయ అనుభ‌వం, ఇంతే స్థాయిలో పాల‌నానుభ‌వం. రాజ‌కీయ మేరు న‌గాల‌ను ఢీకొట్టిన వైనం. అప్ర‌తిహ‌త ప్ర‌జాప్రాబల్యం ఉన్న నాయకుల‌ను సైతం మ‌ట్టి క‌రిపించిన తీరు.. అన్నీ కుప్ప‌గా పోస్తే.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు!! ఉమ్మ‌డి రాష్ట్రాన్ని తొమ్మ‌దిన్న‌రేళ్లు ఏలిన పాల‌కుడు ఆయ‌న‌. అనేక మంది మేధావుల‌ను, రాజ‌కీయ దిగ్గ‌జాల‌ను ఎదిరించి నిలిచిన నాయ‌కుడు ఆయ‌న‌. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది! ఆయ‌న ప‌ద్మ‌వ్యూహంలో చిక్కుకున్నారు. రాజ‌కీయంగా ఆయ‌న ముందు పాఠాలు నేర్చిన‌వారే ఆయ‌నకు ఇప్పుడు చుక్క‌లు చూపిస్తున్నారు. ఏపీ, త‌లెంగాణ రెండు రాష్ట్రాల్లోనూ చంద్ర‌బాబు తీవ్ర‌మైన వ్య‌తిరేక గాలులు వీస్తున్నాయి.42160675_2284825778197667_5906384870216564736_n

నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న‌కు మిత్రుడుగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు, మ‌రో నాలుగు అడుగులు ముందుకు వేసి.. చంద్ర‌బాబును, ఆయ‌న పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించి తీరుతాన‌ని చెప్పారు. అంతేకాదు, కేవ‌లం 30 సీట్ల‌కే చంద్ర‌బాబును ప‌రిమితం చేస్తాన‌ని కూడా వెల్ల‌డించారు. ఇక‌, ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌రేస‌రి! వీట‌న్నింటినీ మించి ఇప్పుడు ప‌క్క‌రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా చంద్ర‌బాబు తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. నేను మూడో నేత్రం తెరిస్తే.. అంటూ.. పెద్ద ఎత్తున కేసీఆర్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌తో మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా దూషిస్తున్నారు. 42189043_2284826328197612_1725745025200947200_n

దీంతో చంద్ర‌బాబు స్థాయి నానాటికీ త‌గ్గిపోతోంది. నిజానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా.. ప‌క్క‌రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉండ‌డం అత్యంత అవ‌స‌రం. అయితే, దీనికి విరుద్ధంగా చంద్ర‌బాబుకు కేసీఆర్‌తో తీవ్రాతి తీవ్ర‌మైన విభేదాలు ఉన్నాయి. మ‌రోప‌క్క‌, వీరిద్ద‌రి మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్న గ‌వ‌ర్న‌ర్ కూడా బాబు వ్య‌తిరేకంగానే ఉన్నారు. ఆయ‌న‌పై చంద్ర‌బాబు త‌న‌కు అనుకూలంగా ఉన్న మీడియాలో వ్య‌తిరేక క‌థ‌నాలు ప్ర‌చారం చేయించార‌ని, తాను ఏపీ, తెలంగాణాల మ‌ధ్య మంచి కోరుకుంటే.. త‌న‌కు వ్య‌తిరేకంగా బాబు క‌థ‌నాలు రాయించార‌ని గ‌వ‌ర్న‌ర్ క‌న్నెర్ర చేశారు.,chandra-babu

ఇక‌, కేంద్రం కూడా చంద్ర‌బాబుపై క‌త్తిక‌ట్టిన విష‌యం ఆయ‌నే చెప్పుకొంటున్నారు. నిజానికి రూపాయి కూడా లేని ఏపీకి అన్ని విధాలా వివిధ ప‌థ‌కాల కింద‌నిధులు ఇచ్చింది కేంద్ర‌మే! ఇత‌ర రాష్ట్రాల‌క‌న్నా కూడా ఎక్కువ‌గానే నిధులు ఇచ్చింది. అయితే ఈ విష‌యాన్ని మ‌రుగున ప‌డేసి, కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను కూడా తానే చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పుకోవ‌డం కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌ను విస్మ‌యానికి గురి చేసింది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఏకాకి అయిపోయారు. ఇప్పుడు ఆయ‌న‌కు జ‌ట్టుకట్టేవారు ఎవరు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న. కేంద్రంలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం చంద్ర‌బాబుతో క‌లిసి వ‌చ్చేందుకు ఆప్ మిన‌హా ఏ పార్టీ కూడా లేదు. దీనికితోడు ఆయ‌న‌పై రాజ‌కీయ దాడి మ‌రింత పెరిగే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ప‌ద్మ‌వ్యూహంలో చంద్ర‌బాబు.. మునుగుతారా… తేలుతారా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share