బాబుది వ్యూహ‌మా? భ‌య‌మా? ఎందుకిలా?

November 2, 2018 at 10:27 am

ఏపీ ప్ర‌జ‌ల‌తో ఆడుకుంటున్న పార్టీ ఏదైనా ఉంటే.. అది ఒక్క టీడీపీనే ! ముఖ్యంగా చంద్ర‌బాబు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. ఆయ న ఎక్క‌డా త‌న స్థైర్యాన్ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేసుకోలేక పోతున్నారు. ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతున్నారు. ఈ క్ర‌మంలోనే 2014లో బీజేపీతోను, ఇప్పుడు తాజాగా జ‌ట్టుక‌ట్టి బ‌ద్ధ శ‌త్రువు కాంగ్రెస్ తోను చేతులు క‌లిపి 2019 ఎన్నిక‌ల‌కు వెళ్తున్నారు. దీనిని ఏపీ ప్ర‌జ‌ల కోసమేన‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు దేశంలోని మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా ప్ర‌శ్నిస్తుండ‌డంతో ఇది జాతీయ అవ‌స‌రమ‌ని చెప్పుకొస్తున్నా రు చంద్ర‌బాబు. ఢిల్లీకి వెళ్లిన ప్ర‌తిసారీ రాష్ట్ర ప్రయోజ‌నాల కోసమే వెళ్లాన‌ని చెప్పే చంద్ర‌బాబు తాజాగా ఈ వారంలోనే రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు.45367204_2344480632232181_265614323911491584_n

ప్ర‌ధానంగా విశాఖలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పై జ‌రిగిన కోడి క‌త్తి దాడిని బాబు బాగానే వాడుకున్నార‌ని అంటున్నారు. దీని ని అడ్డు పెట్టుకుని ఢిల్లీకి వెళ్లి.. మంత్రాంగం నెరిపి.. ఈ ఘ‌ట‌న‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. మొత్తా నికి ఆగ‌ర్భ శ‌త్రువుతోనూ జ‌ట్టుకు చేతులు చాచి.. అన్న‌గారి ఆత్మ ఘోషించేలా చేశార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్‌తో బాబు జ‌ట్టు క‌ట్ట‌డం వెనుక చాలానే ఉంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. నిజానికి కేంద్రంలోని ఏదో ఒక పార్టీతో అంట‌కాగ‌కుండా ఉండ‌లేని దీనాతి దీన స్థితిలో చంద్ర‌బాబు ఉన్నా ర‌నేది విశ్లేష‌కుల మాట‌.45104688_2344480642232180_8739492435647791104_n

నిజానికి అధికారంలో లేనిరోజుల్లోనూ కేంద్రంలోని ప్ర‌భుత్వంతోనో విప‌క్షాల‌తో సంబంధాలు పెట్టుకునే వారు చంద్ర‌బాబు. ఇక‌, 2014లో ఏకంగా న‌రేంద్ర మోడీని ప్ర‌ధానిని చేసింది తామేన‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఏపీ విష‌యంలో ప్ర‌త్యేక హోదాపై కేంద్రం మాట‌మార్చ‌డంతోనే కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకుంటామ‌ని చెప్పిన బాబు అలానే చేశారు. అ యితే, ఇక్క‌డ నిజంగానే రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా? ఉంటే ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకొన్నారు? అనేది మిలియ న్ డాల‌ర్ల ప్రశ్న. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టారు. ఇది కూడా ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావ‌మేన‌ని, బీజేపీని ప్ర‌జ‌లు తిట్టిపోస్తున్నార‌ని అంటున్నారు.chandra-babu

వాస్త‌వానికి ఈ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి ఎలా తెలుసుకున్నారు? ఏ స‌ర్వే చేయించారు? ఎవ‌రి అభిప్రాయాలు తీసుకుని కాంగ్రెస్‌తో క‌లిసి న‌డిచేందుకు రెడీ అయ్యారు? ఇవ‌న్నీ కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లు. త‌న‌పై న‌మోదైన కేసులు ప్ర‌స్తుతం పెండింగ్‌లో ఉండ‌డం, వీటిపై విచార‌ణ‌లు స్టేలో ఉండ‌డంతోనే వాటి నుంచి త‌ప్పించుకునేందుకు చంద్ర‌బాబు కేంద్రంలోని ఏదో ఒక పార్టీతో అంట‌కాగుతున్నార‌న్న విప‌క్షాల వ్యాఖ్యాలే రాబోయే రోజుల్లో బాబును ఇబ్బంది పెడతాయేమో చూడాలి.

బాబుది వ్యూహ‌మా? భ‌య‌మా? ఎందుకిలా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share