పొలిటిక‌ల్ సెంటిమెంట్‌పై బాబు కొండంత ఆశ‌లు!

June 12, 2018 at 8:23 am

తాను చేసింది చెప్పుకోడానికి ఏమీ లేన‌ప్పుడు.. రాజ‌కీయ నేత‌లు స‌హ‌జంగానే ఎదుటివారి బ‌ల‌హీన‌త‌ల‌పై దృష్టి పెడు తుంటారు. పొలిటిక‌ల్ సెంటిమెంట్‌ను అడ్డుకుని పైకి వ‌చ్చేందుకు అనేక విధాలుగా ప్ర‌య‌త్నిస్తారు. ప్ర‌స్తుతం ఏపీ సీఎం చంద్ర‌బాబు విష‌యానికి వ‌చ్చే స‌రికి రెండు ర‌కాల ధోర‌ణులు క‌నిపిస్తున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న రెండు ప‌డ‌వ‌ల‌మీద కాలేస్తున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పార్టీ అదికారంలోకి రావాల‌ని, తాను మ‌ళ్లీ సీఎం అయి రికార్డు సృష్టించాల‌ని బాబు నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌తి విష‌యాన్నీ త‌న‌కు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఒకింత ఓవ‌ర్ చేస్తున్నార‌ని అనిపిస్తోంది. 

 

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఏ పేరు పెట్టి స‌భ నిర్వ‌హించినా.. దాని తెర‌చాటు అస‌లు ల‌క్ష్యం ప్ర‌జ‌ల‌ను ఎన్నిక‌ల‌కు ఏకోన్ముఖు ల‌ను చేయ‌డ‌మే! ఈ క్ర‌మంలోనే ఆయ‌న రెండు ప్ర‌చారాలు చేస్తున్నారు. ఒక‌టి.. విప‌క్షాలు స‌హా జాతీయ పార్టీ అయిన బీజేపీపై తీవ్ర‌స్థాయి లో వ్య‌తిరేక‌త‌ను పెంచ‌డం,  రెండు.. తాను ఏపీకి చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవ‌డం, త‌ద్వారా సింప‌తీ సాధించ‌డం. ఈ రెండు విష‌యాల్లోనూ చంద్ర‌బాబు చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీని అభివృద్ధి చేశాన‌ని, మ‌ళ్లీ త‌న‌కే అధికారం అప్ప‌గించాల్సిన అవ‌స‌రం ఏపీ ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని బాబు అంటున్నారు. నిజ‌మే.. బాబు ఏపీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. 

 

అయితే, ఆయ‌న ఇంత‌గా ప్ర‌చారం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నేది విశ్లేష‌కుల మాట. అస‌లు బాబు ఉన్న‌దే ఏపీని అభివృద్ది చేయ‌డం కోసం. నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బాబుకు ఓటేయ‌క‌పోతే.. ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డాడో .. లేదో అప్పుడే తెలిసిపోతుంది. మ‌రి ఇంత దానికి అంత ప్ర‌చారం అవ‌స‌రం లేదు. ఇక‌, రెండో విష‌యం.. ఎదుటివారి బ‌ల‌హీన‌త‌ల‌ను అనుకూలంగా మ‌లుచుకోవ‌డం. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం, ఏపీలోని విప‌క్షం వైసీపీని బ‌ద్నాం చేయ‌డం ద్వారా చంద్ర‌బాబు ఆ ల‌బ్ధిని కూడా త‌న ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

 

వాస్త‌వానికి ఆయ‌న‌కు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చి.. నాలుగేళ్లు అయింది. తాను చెబుతున్న‌ట్టు.. వైసీపీ మొత్తం దొంగ‌ల పార్టీ.. అవినీతి ప‌రుల పార్టీ అయితే, ఆయ‌న ఇప్ప‌టికే ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఉండాల్సింది. అదేస‌మ‌యంలో త‌న చేతిలోని సీఐడీ, ఏసీబీ వంటి కీల‌క సంస్థ‌ల‌ను వినియోగించి వైసీపీ నేత‌ల గుట్టు ర‌ట్టు చేసి ఉండాల్సింది. ఇక‌, అదేస‌మ‌యంలో నేర‌స్తుల ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తాను.. అంటూ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ఇచ్చిన హామీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు కాలేదు. అంటే.. రాష్ట్రంలో అవినీతి ప‌రులు లేర‌నేగా దీని అర్ధం. ఒక‌వేళ ఉండి ఉంటే.. వారిని ప‌ట్టుకోవ‌డంలో పాల‌నా ప‌రంగా బాబు విఫ‌ల‌మైన‌ట్టేగా?! సో.. ఏదేమైనా.. ఎదుటివారిని విమ‌ర్శించి పైకిఎక్కాల‌నే బాబు నీతి.. స‌రైంది కాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తార‌ని ఆశిద్దాం. 

పొలిటిక‌ల్ సెంటిమెంట్‌పై బాబు కొండంత ఆశ‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share