మాజీ మంత్రికి నో చెప్పిన చంద్రబాబు!

October 8, 2018 at 5:44 pm

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల లోపు పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటి వరకు నియోజకవర్గ స్ధాయి లోనే కాక, జిల్లా పార్టీ లోనే చక్రం తిప్పుతున్నమాజీ మంత్రి, ప్రస్తుత శాసన సభ్యులు గోపాల కృష్ణా రెడ్డి కి కాకుండా 2019 ఎన్నికల లో వేరొక నాయకునికి అవకాశం కలుగనుందా ? అనారోగ్యంతో భాదపడుతున్నఆయనకు ప్రత్యామ్నాయంగా ఆయన కుటుంబ సభ్యులకు కాకుండా ఇంకెవరికైనా సీటు దక్కే అవకాశం ఉందా? అసలు అధినేత చంద్ర బాబు మనసులో ఏముంది? మాజీ మంత్రికి టికెట్ నిరాకరిస్తూ … చంద్రబాబు ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.AP-Cabinet-Expansion--Bojjala-resigns--1491107802-1106

నియోజక వర్గ ప్రజలు గోపాల్ రెడ్డి అని పిలుచుకునే ప్రస్తుత ఎంఎల్ఎ, తెలుగు దేశం పార్టీ లో నే సీనియర్ నాయకులు, పై గా చంద్రబాబు కు బాగా సన్నిహితులు గా ముద్ర పడ్డారు. ఈయనకున్న ఆరోగ్య సమస్యలు వలన బాబు, మంత్రి పదవి నుండి తప్పించి, పుంగనూరు కు చెందిన అమర్ నాధ్ రెడ్డి ని మంత్రిగా తీసుకోవడం జరిగినది. 2019 అసెంబ్లీ ఎన్నికల లో పోటీ చేయడం అనుమానం కావడంతో, గోపాల్ రెడ్డి తనయుడు, బొజ్జల సుధీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. సుధీర్ రెడ్డి కార్యకర్తలతో మమేకమై, పార్టీ కార్యక్రమాల లో చురుకుగా పాల్గొంటున్నారు.26167914_805385602978254_8747483032355284606_n

ఇదే నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎం ఎల్ ఎ ,చంద్ర బాబు తో సన్నిహితంగా మెలిగే యస్ సి వి నాయుడు కూ డా టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన అనుచరులు ఒక అడుగు ముందుకు వేసి, తమ నాయకుని కే అధినేత టికెట్ ఖరారు చేసారని, 2019 ఎన్నికల లో తమ నాయకుడే తెలుగుదేశం అభ్యర్ధి గా పోటీ చేయనున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే గనుక నిజమైతే, పార్టీ సంక్షోభ సమయం నుండీ నమ్మకంగా తన వెంట ఉంటున్న గోపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులకు బాబు ఏ మేరకు న్యాయం చేస్తారో అని ప్రజలు భావిస్తున్నారు. ఒక వేళ టికెట్ దక్కని పక్షంలో బొజ్జల సుధీర్ రెడ్డి తీసుకునే నిర్ణయం, నియోజకవర్గ ప్రజల లో తీవ్ర ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. తాను పోటీచేసి తీరాల్సిందేనని, సుధీర్ రెడ్డి అనుకుంటున్న నేపథ్యంలో స్థానికంగా పార్టీలో సంక్షోభం తప్పేలా లేదు.17352420_1852992908293453_1457183962465287467_n

మాజీ ఎంఎల్ఎ యస్సీవి నాయుడు అనుచరుల ద్వారా సాగుతున్న ప్రచారంతో తెలుగుదేశం కార్యకర్తల లో అయోమయం నెలకొంది. చంద్ర బాబు ప్రస్తుతం జిల్లా రాజకీయాల పై దృష్టి పెట్టడం తో అభ్యర్ధి విషయమై తొందర్లో క్లారిటీ వస్తుందని నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు..

మాజీ మంత్రికి నో చెప్పిన చంద్రబాబు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share