చంద్ర‌బాబు చాణిక్యుడే.. ఈ విష‌యంలో బ‌య‌ట‌ప‌డిందిగా..!

March 20, 2018 at 1:22 pm
cbn-inti

ఏపీ సీఎం, టీడీపీ అధినేత  చంద్ర‌బాబు అప‌ర చాణిక్యుడిగా పేరొందారు. రాజ‌కీయంగా ఆయ‌న త‌న‌కు తిరుగులేద‌ని ఎప్పటిక‌ప్పుడు చెబుతూనే ఉంటారు. జాతీయ స్థాయిలోనే కాదు, ప్ర‌పంచ స్థాయిలోనే త‌న‌కు నేత‌లు ఫిదా అవుతారు! అంటూ క‌బుర్లు ఎన్న‌యినా చెబుతుంటారు. అయితే, వాస్త‌వానికి చంద్ర‌బాబు రాజ‌కీయంగా చేస్తున్న చాణ‌క్య నీతి అంతా ఏపీలోనే అంటున్నారు విశ్లేష‌కులు. తాను నిజంగా అప‌ర‌చాణిక్యుడే అయి ఉంటే ఏపీ ప‌రిస్థితి ఇలా ఎందుకు ఉంటుం ది? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. 

 

ఏపీ విభ‌జ‌న‌చ‌ట్టం తాలూకు హామీల‌ను అమ‌లు చేయాల్సిన ప‌రిస్థితి ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించింది. అంతేకాదు, ప్ర‌త్యేక హోదా విష‌యంలో 14వ ఆర్థిక సంఘాన్ని చూపించి తొండాడింది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేక పోయారు. ఇక‌, కేంద్రంతో పోరు చేస్తేనే ఎంతో కొంత సాధించ‌గ‌లుగుతాం., అంటూ తెలుగు వాడి పౌరుషాన్ని ఢిల్లీకి రుచి చూపించాలని వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లను చంద్ర‌బాబు కొట్టిపారేశారు. (వాస్త‌వానికి జ‌గ‌న్ అనుస‌రించాల‌ని చెప్పిన మార్గాన్ని ఇప్పుడు అనుస‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం).

 

అంతేకాదు, కేంద్రంతో పెట్టుకుంటే రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి మొత్తం ఆగిపోతుంద‌ని, అభివృద్ధి నిలిచిపోతే.. పెట్టుబ‌డులు రావ‌ని, దీంతో నిరుద్యోగులు పెరుగుతార‌ని, ఇలా బాబు మోకాలికి, బోడిగుండుకూ ముడేస్తూ.. బీజేపీ చెప్పిన‌ట్టు న‌డుచుకున్నారు.(దీనికి ఆయ‌న‌పై ఉన్న కొన్ని కేసులే కార‌ణ‌మ‌ని అంటారు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు) మొత్తంగా ఇప్ప‌టికి నాలుగేళ్లు పూర్త‌యి పోయాయి. 

 

అంతేకాదు, ఈ నాలుగేళ్ల‌లో బీజేపీ ఏపీ నుంచి అడిగిన రాజ్యసభ సీట్లు(సురేష్ ప్ర‌భు).. ఎమ్మెల్సీలు, ఏపీలో రెండు మంత్రి పదవులు ఇచ్చి..టీడీపీ కేంద్రంలో రెండు మంత్రి పదవులు తీసుకుని అనుభ‌వించారు. అదేస‌మ‌యంలో కేంద్రంతో సఖ్యతతో ఉండి అన్నీ సాధిస్తామని పదే పదే ప్రకటించారు. కేంద్రంతో గొడవ పడితే పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు ఆగిపోతాయని ప్రజలను  స‌ముదాయించారు. 

 

మరి ఆ భయం ఇప్పుడు ఏమి అయింది. అంటే రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి రావటంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాఫ‌ర్వాలేదన్న చందంగా చంద్రబాబు ఇప్పుడు పావులు కదుపుతున్నారన్న విష‌యం, త‌న అప‌ర చాణ‌క్యాన్ని ఏపీ ప్ర‌జ‌ల‌పైనే ప్ర‌యోగిస్తున్నార‌న్న నిజం ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతోంది. అందుకే ఇప్పుడు ఎవరైనా మోడీని తిట్టండి…నన్ను కాదు అని కొత్త పాట అందుకున్నారు.  నిజానికి ఎన్నిక‌లు మ‌రో రెండేళ్ల దాకా లేవ‌ని ఇప్పుడు సంచ‌ల‌న వార్త వ‌స్తే.. బాబు మ‌ళ్లీ ప్లేట్ ఫిరాయించ‌రా? అంటున్నారు విప‌క్ష నాయ‌కులు. మ‌రి గ‌తాన్ని ఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. నిజ‌మే క‌దా! అని అనిపించ‌డం లేదూ!!

చంద్ర‌బాబు చాణిక్యుడే.. ఈ విష‌యంలో బ‌య‌ట‌ప‌డిందిగా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share