లోకేష్ సీటు కోసం బాబుకు ఎన్ని క‌ష్టాలో

May 8, 2018 at 5:33 pm
babu-lokesh

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్‌కు సీటు క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న మండ లికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అక్క‌డి నుంచి చంద్ర‌బాబు ఆయ‌న‌ను మంత్రిగా తీసుకుని ఐటీ, పంచాయ‌తీరాజ్ శాఖ ల‌ను అప్ప‌గించాడు. అయితే, ఈ ప‌రిణామంపై విప‌క్షం వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే రోజా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. దొడ్డిదారిన లోకేష్ మంత్రి అయ్యాడ‌ని ఆమె అప్ప‌ట్లో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించింది. ప్ర‌జల్లోకి వ‌చ్చి గెలిచే స‌త్తా లేక‌నే లోకేస్‌ను దొడ్డిదారిలో మంత్రిని చేశాడంటూ.. చంద్ర‌బాబుపైనా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించింది. దీంతో ఇప్పుడు వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మండ‌లి ప‌ద‌వికి రాజీనామా చేయించి.. ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు. 

 

ఈ క్ర‌మంలోనే లోకేష్‌కు అనుకూలంగా ఉండే నియోజక‌వ‌ర్గం వేట‌లో ప‌డ్డారు బాబు. అయితే, లోకేష్‌కు అనుకూలంగా ఏ ఒక్క నియోక‌వ‌ర్గం కూడా క‌నిపించ‌క‌పోవ‌డం నానా తిప్ప‌లు ప‌డుతున్నార‌ని స‌మాచారం. ఏదో ఒక చోట నుంచి పోటీ చేయిస్తే.. తీరా గెల‌వ‌క పోతే.. లోకేష్ ప‌రువుతో పాటు పార్టీ ప‌రువు కూడా పోతుంద‌ని బాబు భ‌య‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే లోకేష్‌కు దిమ్మ‌తిరిగే విజ‌యం అందించే నియోజ‌క‌వ‌ర్గం కోసం బాబు తీక్ష‌ణంగా వెతుకుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న దృష్టి పెట్టిన నియోజ‌క‌వ‌ర్గాలు మొత్తం ఫుల్ ప్యాక్డ్‌గా ఉండ‌డంతో త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌. లోకేష్ బాబుకు నేరుగా త‌న సీటునే ఇవ్వాల‌ని భావించినా.. త‌న‌కు ఇబ్బందులేన‌ని చంద్ర‌బాబు భావిస్తున్నాడ‌ట‌. చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గం బాబుకు పెట్ట‌ని కోట‌. ద‌శాబ్దాలుగా ఆయ‌న అక్క‌డి నుంచే గెలుస్తున్నాడు.

 

ఆ సీటును లోకేష్‌కు కేటాయిస్తే.. త‌న ప‌రిస్థితి ఏంట‌న్న‌ది బాబు ఆలోచ‌న‌. పోనీ.. ఇదే జిల్లాలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చంద్ర‌గ‌రి నుంచి పోటీ చేయిద్దామ‌న్నా చెవిరెడ్డి హ‌వా ముందు లోకేష్ త‌ట్టుకుని నిల‌బ‌డడం అంత ఈజీకాదు. పోనీ.. న‌గ‌రి నుంచి పోటీ చేయిస్తే.. ఈ సీటును ఆశిస్తున్న దివంగ‌త గాలి ముద్దుకృష్ణ ఇద్ద‌రు కుమారులు చాప‌కింద నీరులాగా వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తే.. రోజా గెలుపు మ‌ళ్లీ ఖాయం. ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయిద్దామంటే.. లోకేష్ అయిష్టంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో బాబుకు చిత్తూరుపై ఆశ‌లు లేకుండా పోయాయి. ఇక‌, అనంత‌పురంలో టీడీపీ కంచుకోట హిందూపురం నుంచి పోటీ చేయిద్దామంటే.. అక్క‌డ వియ్యంకుడు బాల‌య్య ఉన్నాడు. ఆయ‌న దానిని ఎలాగూ వ‌దిలిప‌ట్టే ప‌రిస్థితి లేదు. 

 

పోనీ.. అన్న‌గారు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణాలో ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న గుడివాడ నుంచి బ‌రిలోకి దింపాల‌న్నా.. కొడాలి నాని రాజ‌కీయ విమ‌ర్శ‌ల క‌త్తుల‌తో ఇప్ప‌టికే టీడీపీ ఉనికి లేకుండా చేశాడు.  ఇక్క‌డ‌ ఓడితే ప‌రువు పోతుంది. పైగా ఎన్టీఆర్ జిల్లాలో మ‌న‌వ‌డి ఓట‌మి అంటే.. మ‌రో చ‌రిత్ర లిఖించిన‌ట్టు అవుతుంది. విప‌క్షాల‌కు కోరి అస్త్రాల‌ను అందించిన‌ట్టు అవుతుంది. ఇక‌, ఈ జిల్లాలో ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గం పెన‌మ‌లూరు మిగిలి ఉంది. ఇక్క‌డ కూడా టీడీపీ నేత బోడే ప్ర‌సాద్ ఉన్నాడు. ఈయ‌న కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి పోటీ చేయాల‌ని భావిస్తున్నా డు. అయినా కూడా లోకేష్ అంటే సీటును త్యాగం చేసే అవ‌కాశం ఉంది. అయితే, ఇక్క‌డ లోకేష్ గెలుపు అంత ఈ జీ కాదు. వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి ఇక్క‌డ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే.. ఆయ‌న గెలిచే అవ‌కాశాలే ఎక్కువ‌. మొత్తానికి లోకేష్ కోసం చంద్ర‌బాబు ప‌డుతున్న తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. 

లోకేష్ సీటు కోసం బాబుకు ఎన్ని క‌ష్టాలో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share