బాబు ఐడియా.. సింగ‌పూర్ వ‌ర్స‌టీ పుస్త‌కంలో `అమ‌రావ‌తి` ఛాప్ట‌ర్‌

November 19, 2017 at 1:11 pm
babu-TJ

కొన్ని కొన్ని విష‌యాల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు తీసుకుంటున్న చొర‌వ చాలా ప్ర‌శంస‌నీయంగా ఉంటోంది. ముఖ్యంగా విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర‌మైన అప్పుల్లో ఉన్న ఏపీని ఒడ్డుకు చేర్చేందుకు, అభివృద్ధి దిశ‌గా న‌డిపించేందుకు, అంత‌ర్జాతీయ విప‌ణిలో ఏపీని అగ్ర‌గామిగా చేసేందుకు చంద్ర‌బాబు చేస్తున్న కృషి న‌భూతో న‌భ‌విష్య‌తి! ముఖ్యంగా చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. దీనిని అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్ది ప్ర‌ముఖ ప‌ట్ట‌ణాల్లో ప్ర‌త్యేక ప్లేస్ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అంత‌ర్జాతీయ డిజైన్ల‌తో దీనిని నిర్మించాల‌ని భావిస్తున్నారు. 

ఇక‌, ఇప్పుడు బాబు తీసుకున్న తాజా డెసిష‌న్ మ‌రింత‌గా ఏపీని ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రిచ‌యం చేయ‌నుంది. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌ధాని నిర్మాణంలో భాగంగా సింగ‌పూర్‌తో క‌లిసి సాగుతున్న చంద్ర‌బాబు తాజాగా ఆ దేశ‌ మంత్రి ఈశ్వ‌ర‌న్‌తో క‌లిసి జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ(జేఐఎస్‌సీ) రెండో సమావేశంలో పాల్గొన్నారు. అమ‌రావ‌తి డిజైన్లు, నిర్మాణం వంటి అంశాల‌ను చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా స్టేట్స్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో సింగపూర్‌ వర్సిటీ తీసుకొస్తున్న పుస్తకంలో అమరావతి నిర్మాణాన్ని ఒక ఛాప్టర్‌గా చేర్చాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. 

ఇలా.. స‌ద‌రు పుస్త‌కంలో అమ‌రావ‌తికి చోటు ల‌భిస్తే.. అంత‌ర్జాతీయంగా గుర్తింపు ల‌భించ‌డంతోపాటు .. అనేక దేశాల విద్యార్థులు అమ‌రావ‌తిని అధ్య‌యనం చేసేందుకు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని బాబు యోచిస్తున్నారు. దీనివ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌వారికి అమ‌రావ‌తి పాఠాలు అందుబాటులోకి రావ‌డంతో ప‌ర్యాట‌కం అబివృద్ధి చెందుతుంద‌ని బాబు ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, 2018 రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకులకు భారతదేశానికి ముఖ్య అతిధిగా వస్తున్న సింగపూర్‌ ప్రధానమంత్రి, అదే సందర్భంలో అమరావతిని సందర్శించేలా చూడాలని ఈశ్వరన్‌ను సీఎం చంద్రబాబు కోరారు. మొత్తానికి చంద్ర‌బాబు ఐడియా.. అమ‌రావ‌తిని.. అంత‌ర్జాతీయ స్థాయి పాఠ్యాంశం చేయ‌నుంది. 

బాబు ఐడియా.. సింగ‌పూర్ వ‌ర్స‌టీ పుస్త‌కంలో `అమ‌రావ‌తి` ఛాప్ట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share