వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు బాబు భారీ వ్యూహం?

October 22, 2018 at 3:07 pm

ఏపీలో ఆయ‌న‌కు తిరుగు ఉండ‌కూడ‌దు. ఆయ‌న‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌దు. ఆయ‌న‌లోపాల‌ను ఎత్తి చూప‌కూడ‌దు. అదే ఆయ‌న నైజం. ఆయ‌న‌ను ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. వారు విప‌క్ష నాయ‌కులు, రౌడీలు.. సంఘ విద్రోహులు. ఇదీ ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నేది ఆయ‌న ప్ర‌ధాన కాంక్ష‌. ఈ కోణంలోనే ఆయ‌న త‌న‌కు ఉన్న అన్ని అడ్డంకుల‌ను ఒక్కొక్క‌టిగా దాటుకుని రాష్ట్రంలో తానుత‌ప్ప మిగిలిన ప‌క్షాలు ఏవీ కూడా లేకుండా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ముఖ్యంగా వైసీపీని అణిచి వేయాల‌ని చూస్తున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. తాజాగా పోలీసులను ఉద్దేశించి కూడా చంద్ర‌బాబు న‌ర్మ‌గ‌ర్భంగా వైసీపీని అణిచేసేందుకు వ్యూహాత్మ‌క వ్యాఖ్య‌లు చేశారు.chandra-babu

రాష్ట్రంలో ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్న‌వారిని దొంగ‌ల్లాగా, వారిని పెద్ద ఎత్తున విద్రోహులుగాను చిత్రీక‌రిస్తు న్నా రు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న నేప‌థ్యంలో త‌న‌ను ఎదిరించిన వారిని, లేదా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించి న వారిని ఆయ‌న రౌడీలుగాను, గూండాలుగాను చిత్రీక‌రించేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు క‌దులుతున్నారు. రాజ కీయం ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాని చెబుతున్నా.. ఉద్దే శం మాత్రం చాలా డిఫ‌రెంట్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్రజల భద్రత, శాంతిభద్రతలే ముఖ్యం అని బాబు పైకి చెబు తున్నా.. త‌న పార్టీ నేత‌ల భ‌ద్ర‌త‌, త‌న‌ను ప్ర‌శ్నించ‌కుండా చూసుకునే భ‌ద్ర‌త ఆయ‌న‌కు ఇప్పుడున్న ప‌రిస్థితిలో చాలా కీలకం. అందుకే ఆయ‌న పోలీసుల‌ను వినియోగిస్తున్నారు.

కేసులు పెట్టించి త‌నపై వ్య‌తిరేక‌త‌ను అణిచేయాల‌ని చూస్తున్నార‌నడంలో ఎలాంటి సందేహ‌మూ లేదు. రాజకీయం కోసం తునిలో రైళ్లను తగులబెడతారు. అమరావతిలో చెరుకు తోటలకు నిప్పు పెడతారు. పోలవరం కాలువకు గండి కొడతారు. రిపబ్లిక్‌ డే రోజు పారిశ్రామికవేత్తల సదస్సును అడ్డుకోవడానికి విశాఖలో జల్లికట్టు ఉద్యమం అంటారు. ఆఖరికి తితలీ తుఫానులో సైతం ప్రజల్లోకి చొరబడి భోజనాల్లేవని నన్నే ప్రశ్నిస్తున్నారు. అసలు నిజం తెలిశాక పారిపోతారు అనడం చూస్తుంటే.. చంద్ర‌బాబు వైఖ‌రి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. త‌న‌ను ఎవ‌రు ప్ర‌శ్నించినా.. ఆయ‌నలో ఓర్పు న‌శిస్తోంది. ఆయ‌న‌లో స‌హ‌నం చ‌చ్చిపోతోంది. ఎన్నిక‌ల్లో ఓడిపోతాన‌నే భ‌యం ఆయ‌న‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌బ‌ట్టే ఇలా వ్యాఖ్యానిస్తున్నార‌నే విష‌యం కూడా తెర‌మీదికి వ‌స్తోంది. మ‌రి ఇలాంటి వ్యాఖ్య‌లు.. బాబుకు ప్ల‌స్ అవుతాయా? మైన‌స్ అవుతాయా? చూడాలి.

వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు బాబు భారీ వ్యూహం?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share