చంద్ర‌బాబు… చీప్ పాలిటిక్స్!!

October 14, 2018 at 11:10 am

రాజ‌కీయాల్లో ఏమైనా చేయొచ్చ‌నేది సాధార‌ణ‌మే అయినా.. పార్టీ అధినేత‌గా, ఏపీ అధినేత‌గా ఉన్న టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు చేస్తున్న రాజ‌కీయాల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో త‌న‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీతో జ‌త‌క‌ట్ట‌డం, ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్ట‌డం, టీడీపీపైనా, టీడీపీ ప్ర‌భుత్వంపైనా క‌క్ష సాధిస్తున్నార‌ని, కుట్ర రాజ‌కీయాలు చే్స్తున్నార‌ని విమ‌ర్శించ‌డం పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని ప్లాన్ వేయ‌డం వంటివి ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌ధాన విష‌యాలు. బాబ్లీ విష‌య‌మే తీసుకుంటే.. 2007నాటి ఘ‌ర్ష‌ణ‌కు సంబందించి మ‌హారాష్ట్ర‌లోని ధ‌ర్మాబాద్ కోర్టు చంద్ర‌బాబు స‌హా ప‌లువురుకికోర్టుకు హాజ‌రుకావాల‌ని ఆదేశిస్తూ.. నాన్ బెయిల్ వారెంట్లు జారీ చేసింది. అయితే, ఇవి త‌మ‌కు అంద‌లేద‌ని టీడీపీ అధినేత ప్ర‌క‌టించారు. chandra-babu

కోర్టుకు కూడా వెళ్ల‌లేదు. కానీ, దీనిని మాత్రం త‌న‌కు రాజ‌కీయంగా ఎంత‌గా వాడుకోవాలో అంత‌కంటే ఎక్కువగానే వాడుకున్నారు. కేంద్రంలోని మోడీ క‌నుస‌న్న‌ల్లోనే ధ‌ర్మాబాద్ కోర్టు ప‌నిచేస్తున్న‌ద‌న్న రీతిలో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు సంధించారు. త‌న‌ను బ‌ద్నాం చేయ‌డానికి మోడీ అండ్ బీజేపీ కుట్ర చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఇక‌, బాబు అనుకూల మీడియా కూడా వీటిని బాగానే ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లింది. క‌ట్ చేస్తే.. తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో హాజ‌రు నుంచి చంద్ర‌బాబుకు మిన‌హాయింపును ఇస్తూ.. అదే ధ‌ర్మాబాద్ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు ఈ కేసు మ‌రుగున ప‌డిపోయింది. మ‌రి ఇప్పుడు బాబు ఏమంటారు? అనేది దానికి స‌మాధానం లేదు. మోడీ క‌నుస‌న్న‌ల్లోనే ధ‌ర్మాబాద్ కోర్టు త‌న‌కు నోటీసులు పంపించింద‌ని చెప్పిన బాబు ఇప్పుడు అదే కోర్టు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తే.. క‌నీసం ఆయ‌న మాట్లాడ‌లేదు.

ఇదిలావుంటే, రాష్ట్రంలోని కొంద‌రు మెగా వ్యాపారుల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ఓ వారం కింద‌ట టీడీపీ ఎమ్మెల్యే పైనా తాజాగా టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ వ్యాపార సంస్థ‌లు, ఇంటిపైనా అధికారులు దాడులు చేశారు. నిజానికి ఇవి రొటీన్‌గా చేసేవే. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యంలో వీటి నుంచి ల‌బ్ధి పొందాల‌ని, అదేస‌మ‌యంలో బీజేపీని, జ‌గ‌న్‌, ప‌వ‌న్ల‌ను ఏకేయాల‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడిగితే.. ప్రశ్నిస్తే.. రాష్ట్రాన్ని ఐటీ దాడులతో భయపెట్టాలని కేంద్రం చూస్తోందని విరుచుకుపడ్డారు. హోదా కోసం గళమెత్తిన వారిని ఐటీ శాఖ మాటున కేంద్రం దాడులకు పాల్పడుతోంద‌ని విమ‌ర్శించారు. మొన్న మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులపైన.. నిన్న సుజనాచౌదరి, ఈ రోజున సీఎం రమేశ్‌పైనా దాడులు చేయించింద‌న్నారు.

రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడేవారిపై కేంద్రం రాజకీయ దాడులకు పాల్పడుతోంద‌న్నారు. వాస్త‌వానికి ఐటీ దాడుల‌కు కేంద్రానికి పెద్ద సంబంధం ఉండ‌ద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇదే చంద్ర‌బాబు కేంద్రంతో క‌లిసి ఉన్నా.. ఈ దాడుల‌ను ఆప‌గ‌లిగేవారు మాత్రం కాద‌నేది నిజం. ఐటీ వ‌ర్గాల‌కు వివిధ రూపాల్లో అందుతున్న స‌మాచారం ఆధారంగానే త‌నిఖీలు నిర్వ‌హించ‌డం ప‌రిపాటి. కానీ, చంద్ర‌బాబు మాత్రం ప్ర‌తి విష‌యాన్నీ త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు, సానుభూతి పొందేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మే ఇప్పుడు చీప్‌గా క‌నిపిస్తోంద‌ని, హుందాగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఆయ‌న ఇలా చీప్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు… చీప్ పాలిటిక్స్!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share