మాజీ మంత్రిని లూప్ లైన్ లోకి నెట్టేశారా?

November 9, 2018 at 4:35 pm

చంద్రబాబునాయుడు అంతే.. తాను చేయదలచుకున్నది నిర్దాక్షిణ్యంగా చేసుకుంటూ పోతారు. అవతలి వారి సీనియారిటీ, పార్టీకి గతంలో ఎంత ఉపయోగపడ్డారు.. ఇలాంటి అంశాలేమీ పట్టించుకోరు. ప్రస్తుతానికి ఏ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తారో ఆ రకంగా చేసుకుపోతారు. ఆయన తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిని లూప్ లైన్లోకి నెట్టేసి, మాజీ ఎంఎల్ఎ ఎస్సీవీ నాయుడును ఎంకరేజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారికంగా ఇన్చార్జి పదవి ఇవ్వలేదు గానీ.. ఈసారి బొజ్జల కుటుంబానికి కూడా టికెట్ దక్కదని,ఎస్సీవీనే పార్టీ కేండిడేట్ అవుతారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.bojjala-gopalakrishnareddy-

తెలుగు దేశం అదినేత చంద్రబాబు స్వంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా లోనే బాబు పట్ల విశ్వాసం, విధేయత కలిగి ఉన్న నాయకులలో మాజీ మంత్రి గోపాలకృష్ణా రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఎన్టీఆర్ ను గద్దె దించిన సంక్షోభ సమయం లోనూ చంద్రబాబు కు మద్దతు గా గోపాల్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారని జిల్లా ప్రజలు భావిస్తారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన, రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా, తెలుగు దేశం పార్టీ ని అంటిపెట్టుకుని ఉన్నారు. అలిపిరి ఘటనలో చంద్రబాబు తో పాటు గాయపడిన ఆయన కు ఇటీవలి ఆరోగ్యం సహకరించక పోవడంతో మంత్రి పదవి నుండి చంద్రబాబు తొలగించారు.SKHT MLA SCV NAIDU IN SPARKLE FUNCTION-2009

తాజాగా ఆయన ఎంఎల్ఎ టికెట్ కు కూడా ఎసరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. గోపాల్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ఆయన భార్య బృందమ్మ, కమారుడు సుధీర్ రెడ్డి లు నియోజక వర్గంలో పర్యటిస్తూ, పార్టీ కార్యక్రమాల లో చురుగ్గానే పాల్గొంటున్నారు. గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను కాదని, బాబు మాజీ ఎంఎల్ఎ యస్సివి నాయుడు ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈయన గతంలో పార్టీ మారి కాంగ్రెస్ లో చేరి ఒకసారి గెలుపొందడం జరిగింది. తిరిగి 2014 ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ లో చేరారు. యస్ సివి నాయుడు నేతృత్వం లో నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కావడం పలు అనుమానాలకు దారితీస్తూ,పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది.

ఇప్పటి వరకు పార్టీకి విశ్వాసంగా ఉన్న గోపాల్ రెడ్డి కుటంబీకులకు చంద్రబాబు టికెట్ నిరాకరించి, పార్టీలు మారిన తన సామాజిక వర్గానికి చెందిన యస్ సివి నాయుడుకు సీటు ఇస్తే, జిల్లా లో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహానికి గురి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జిల్లా లోని తూర్పు ప్రాంత లోనే సీనియర్ నాయకుడైన గోపాల్ రెడ్డి కుటుంబ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్దకం అయ్యేటట్లు చంద్రబాబు తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఏ మేరకు ఫలితాల ను ఇస్తుందో వేచిచూడక తప్పదు.

మాజీ మంత్రిని లూప్ లైన్ లోకి నెట్టేశారా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share